ఈ మద్యనే ఆహా ఓటిటీలో రిలీజైన  'బెల్‌ బాటమ్‌' తెలుగు సినిమాలో  డిటెక్టివ్‌ దివాకరంగా  ప్రేక్షకులను ఆకట్టుకున్న రిషబ్‌ శెట్టి గుర్తుండే ఉండి ఉంటారు. ఆయన తాజా చిత్రం  ‘హీరో’ సినిమా షూటింగులో పెట్రోలు బాంబు మంటల్లో గాయపడ్డాడు. రీసెంట్ గా హాసన్‌ జిల్లా బేలూరులో ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. స్క్రిప్ట్‌ ప్రకారం పెట్రోల్‌ బాంబు విసిరి నటులు రిషబ్, గానావి లక్ష్మణ పరారీ కావాల్సి ఉంటుంది. అయితే బాంబు విసిరి పరిగెత్తే లోపు మంటలు అంటుకుని గాయపడినట్లు సమాచారం. ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 

ఇక రిషబ్ శెట్టి స్పెషల్ కంటెంట్‌తో ఆఫ్‌బీట్ సినిమాలు చేయగల హీరోగా కన్నడ ఇండస్ట్రీ లో బాగా ఫెమస్. ఆయన సినిమాలు ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అలాగే  రిషబ్ శెట్టి కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడు, రచయిత.  బెంగళూరు ఫిలిమ్ ఇనిస్టిట్యూట్‌లో దర్శకత్వం కోర్సు చేసి నటుడుగానే తెరమీది కొచ్చాడు. 2013 నుంచి  కమర్షియల్ సినిమాలలో కనిపిస్తున్నాడు. 2016 లోనే దర్శకత్వం చేపట్టి ‘రికీ’, ‘కిరిక్ పార్టీ’ అనే రెండు కమర్షియల్ సినిమాలు తీశాడు. వీటిలో ‘కిరిక్ పార్టీ’ బాగా హిట్టయింది. ఆ తర్వాత 2018లో రూటు మార్చి వాస్తవిక సినిమా మీద దృష్టి పెట్టాడు. 

ఇక రిషబ్ నటించిన సినిమా హీరో నుండి సంక్రాంతి కానుకగా ట్రైలర్ విడుదల అయి అభిమానులను అలరించింది. భారత్ రాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో గనవి హీరోయిన్ గా నటిస్తుంది, చిక్మగళూరులోని కాఫీ ఎస్టేట్ లో ఒకే ప్రదేశంలో కరోనా సమయంలో హీరో సినిమా షూటింగ్ జరుపుకుంది. హీరోకి అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ లు హైలెట్ కానున్నాయి.