మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. విజేత సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ దేవ్ రెండో ప్రయత్నంగా సూపర్‌ మచ్చి సినిమా చేస్తున్నాడు. పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రిజ్వాన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అవుట్ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇటీవల కరోనా కారణం ఆగిపోయిన ఈ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ షాక్ ఇచ్చాడు. ఈ సినిమాకు ముందుగా రియా చక్రవర్తిని హీరోయిన్‌గా తీసుకున్నామని, అయితే అయితే కొంత షూటింగ్ జరిగిన తరువాత రియా తనకు సుశాంత్‌తో సినిమా ఉందంటూ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో కన్నడ హీరోయిణ్ రచితా రామ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నామని తెలిపారు.

ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని చెప్పిన కళ్యాణ్ దేవ్‌, ఒక సాంగ్‌తో పాటు మరో రెండు రోజుల టాకీ పార్ట్ మాత్రమే షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉందని వెల్లడించారు. ఇటీవల షూటింగ్ సందర్భంగా తాను తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించాడు కళ్యాణ్, తాను ఇంటికి వెళ్లటం లేదని ఇంట్లోనే సపరేట్‌గా మరో గదిలో ఉంటున్నానని, కుటుంబ సభ్యులను కూడా కలవటం లేదని చెప్పాడు.