Asianet News TeluguAsianet News Telugu

వర్మ ‘క్లైమాక్స్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ అన్ని కోట్లా?

లాక్ డౌన్ లో  వర్మ సైలెంటుగా ఉంటాడులే అనుకుంటే..  ‘క్లైమాక్స్’ అంటూ ఓ సినిమాని రిలీజ్ చేసేసారు. ఇంతకు ముందు ‘గాడ్ సెక్స్ ట్రూత్’ అనే వివాదాస్పద పోర్న్ మూవీ తీసిన మియా మాల్కోవా తోనే ఈ సినిమా తీశాడు. ఇది ఫీచర్ ఫిలిమా.. షార్ట్ ఫిలిమా అన్న క్లారిటీ లేకుండా 53 నిముషాల లెంగ్త్ తో రిలీజైంది. టీజర్, ట్రైలర్ తో కిక్ ఇచ్చిన ఆయన సినిమా విషయంలో మాత్రం ఎప్పటిలాగే నిరాశపరిచారు. అయితే ఈ సినిమా నిమిత్తం వర్మ బాగానే సంపాదించాడు అని వినపడుతోంది. అయితే ఆ మొత్తం ఎంత...
 
RGV  World app Climax first day collections
Author
Hyderabad, First Published Jun 8, 2020, 9:05 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

లాక్ డౌన్ లో  వర్మ సైలెంటుగా ఉంటాడులే అనుకుంటే..  ‘క్లైమాక్స్’ అంటూ ఓ సినిమాని రిలీజ్ చేసేసారు. ఇంతకు ముందు ‘గాడ్ సెక్స్ ట్రూత్’ అనే వివాదాస్పద పోర్న్ మూవీ తీసిన మియా మాల్కోవా తోనే ఈ సినిమా తీశాడు. ఇది ఫీచర్ ఫిలిమా.. షార్ట్ ఫిలిమా అన్న క్లారిటీ లేకుండా 53 నిముషాల లెంగ్త్ తో రిలీజైంది. టీజర్, ట్రైలర్ తో కిక్ ఇచ్చిన ఆయన సినిమా విషయంలో మాత్రం ఎప్పటిలాగే నిరాశపరిచారు. అయితే ఈ సినిమా నిమిత్తం వర్మ బాగానే సంపాదించాడు అని వినపడుతోంది. అయితే ఆ మొత్తం ఎంత...

మొన్న రాత్రి 9 గంటలకు  ఈ సినిమా స్ట్రీమింగ్‌ ప్రారంభం అయ్యింది.ఒకేసారి వేలాది మంది పడటంతో కొద్ది సమయం సదరు యాప్‌ కు సంభందించిన సర్వర్ క్రాష్ అయ్యింది.ఇక సినిమా చూడాలి అంటే 100 రూపాయలు చెల్లించాలి అని కండీషన్ పెట్టారు వర్మ.సినిమాకు మంచి పబ్లిసిటీ చేయడంతో పాటు వర్మ విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి అంచనాలు పెంచింది. ఆ కారణంగా ఈ సినిమాను మొదటి రోజు ఏకంగా మూడు లక్షల మంది వరకు చూసినట్లుగా ట్రెండ్‌ వర్గాల వారు చెబుతున్నారు. మూడు లక్షల వ్యూస్‌ అంటే ఒక్క వ్యూ కు వంద రూపాయల చొప్పున మూడు కోట్లు వచ్చి ఉంటాయి.వర్మ మొదటి రోజే మూడు కోట్ల వసూళ్లు సాధించాడు.థియేటర్ల ద్వారా కూడా ఇంత భారీ మొత్తం సాధ్యం కాదు.

ఇక శ్రేయాస్ మీడియా వారు మాట్లాడుతూ ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని అన్నారు. దాదాపు మూడు లక్షల మంది 'క్లైమాక్స్' సినిమాను తమ ఓటీటీలో చూసారని ఇది నిజంగా అద్భుతమని అన్నారు. ఎన్నో థియేటర్లలో విడుదల చేస్తే తప్ప ఇంత మంది చూడడం అసాధ్యమని.. అలాంటిది ఒక్క వినూత్నమైన కాన్సెప్ట్ తో ఇంతమంది చూసేలా చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా మరిన్ని వైవిధ్యమైన సినిమాలు త్వరలోనే అందుబాటులో ఉంచుతామని చెప్పుకొచ్చారు.  

 ఏకాంతం కోసం ఎడారి ప్రాంతానికి వెళ్లి శృంగార కార్యకలాపాల్లో మునిగి పోయిన ఓ జంట ఎదుర్కొన్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. సినిమాలో మియా ఒంపుసొంపులు మినహాయిస్తే ఆకర్షించే విషయమే లేదు.  రకరకాల యాంగిల్స్ లో ఆమె అందాలు ఎలివేట్ చేయడం తప్ప వేరే పని పెట్టుకోలేదు. అయితే  మియా లాంటి పోర్న్ స్టార్ తో ఏవేవో సీన్స్ ఉంటాయనుకునేవారికి మాత్రం నిరాశపరిచింది. సినిమా చివరి షాట్లో మియా నగ్నంగా ఎడారిలో పడుకుని నడుం భాగాన్ని పైకి లేపితే ఆ గ్యాప్లో సూర్యుడు కనిపించే షాట్ తప్పించి సినిమాలో ఏమీ లేదు.
 
Follow Us:
Download App:
  • android
  • ios