ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో తాను కూడా భాగం అయ్యేలా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'వ్యూహం' చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో తాను కూడా భాగం అయ్యేలా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'వ్యూహం' చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ చిత్రాలకి వివాదాలు జోడించి ఆసక్తి పెంచడంలో వర్మ స్టయిలే వేరు.
వ్యూహం చిత్రం విషయంలో కూడా వర్మ అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. తాజాగా వ్యూహం చిత్ర టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, జగన్ లో చెలరేగిన అంతర్మధనం, ఆయన వెనుక జరిగిన కుట్రలని వర్మ బాగా ఫోకస్ చేసినట్లు ఉన్నారు. ఈ చిత్రంలో జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ నటిస్తున్నారు. అలాగే టీజర్ లో జగన్ తో పాటు చంద్రబాబు, రోశయ్య పాత్రలని కూడా చూపించారు.
ఈ టీజర్ జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది ?, ఆ సమయంలో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ? లాంటి అంశాలను ప్రస్తావిస్తూ సాగింది. టీజర్ లో నేపథ్య సంగీతం ప్రధాన హైలైట్ గా నిలిచింది.
అలాగే జగన్ పాత్ర దారి చివర్లో చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది. 'అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు' అంటూ ఈ టీజర్ అంచనాలను పెంచేసింది. వైఎస్ భారతి పాత్రని మానస పోషిస్తోంది. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది.

