స్టార్ జంటల వివాహాలు ఎంత సర్ ప్రైజింగ్ ను ఇస్తున్నాయో..  అదే తరహాలో వారు డివోర్స్ తీసుకుంటూ అభిమానులకు షాక్ కు గురిచేస్తున్నారు. ఒక్క అభిమానులు ఏంటీ వారు తీసుకుంటున్న నిర్ణయాలతో సినీ పెద్దలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలా స్టార్స్ పెండ్లయినా కొన్నాళ్లకే డివోర్స్ తీసుకోవడం పట్ల డేర్ అండ్ డ్యాష్ డైరెక్టర్ ఆర్టీజీ సెటైరికల్ ట్వీట్ చేశారు.  

మ‌రో ప్ర‌ముఖ సినీ జంట విడిపోయింది. ప్రముఖ సినీ నటుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తనయ ఐశ్వర్య (Aishwarya).. త‌న భ‌ర్త, హీరో ధనుష్ (Dhanush)తో విడిపోతున్న‌ట్టు (separation) ప్ర‌క‌టించారు. న‌టుడు ధ‌నుష్ సైతం తాము విడిపోతున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు. దాదాపు 18 సంవత్సరాలు కలసి వున్న ఐశ్వర్య-ధనుష్ విడిపోవ‌డం అంద‌రినీ షాక్ కు గురిచేస్తున్న‌ది.

 ప్రముఖ సినీ నటుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తనయ ఐశ్వర్య (Aishwarya).. త‌న భ‌ర్త, హీరో ధనుష్ (Dhanush)తో విడిపోతున్న‌ట్టు (separation) ప్రకటించిన విషయం తెలిసిందే. న‌టుడు ధ‌నుష్ సైతం తాము విడిపోతున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. దీంతో అటు సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్ అభిమానులు షాక్ కు గురయ్యారు. 

దాదాపు 18 ఏండ్లు కలసి వున్న ఐశ్వర్య-ధనుష్ విడిపోవ‌డాన్ని ఇంకా పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే గతంలో నాగ చైతన్య - సమంత కూడా ఉన్నట్టుుండి ఒక్కసారిగా వీడిపోతున్నట్టు ప్రకటించారు. వరుసగా స్టార్స్ విడిపోవడం పట్ల పలువురు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా, డైరెక్టర్ ఆర్జీవీ కూడా స్సందించారు. సినీ పరిశ్రమ లోపల, బయట చీమ చిట్టుక్కు మన్న గమనిస్తున్న ఆర్టీజీ ధనుష్ - ఐశ్వర్య డిపోర్స్ సందర్భంగా తన ట్విట్టర్ లో సైటైరికల్ ట్వీట్ చేశారు. అదే విధంగా మ్యారేజ్ కు రెడీ అవుతున్న జంటలకు హిత బోధ చేసేట్టుగా ట్వీట్ లో రాసుకొచ్చారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

‘ పెండ్లి ఎంత భయకరంగా ఉంటుందో యువతను హెచ్చరించేందుకు స్టార్ హీర్ లు డివోర్స్ తీసుకుంటూ ట్రెండ్ సెట్టర్స్ గా నిలుస్తున్నారు. ప్రేమను పెండ్లి కంటే త్వరగా ఏదీ చంపలేదు. జైల్ లాంటి మ్యారేజ్ పరిధిలోకి వెళ్లేందుకు బదులుగా సాధ్యమైనన్నీ రోజులు ప్రేమలో ఉండటమే ఆనందం, ఇదే ఆ రహస్యం. మ్యారేజ్ చేసుకోవడానికి కేటాయించే మూడు నుంచి ఐదు కంటే తక్కువగానే ప్రేమ కనిపిస్తుంది. తెలివిగల వారు ప్రేమిస్తారు... దద్దమ్మలే పెళ్లి చేస్తుకుంటారు.

ఈ విధంగా తనదైన శైలిలో సందేశాత్మకంగా ఆర్జీవీ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. పెండ్లిపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అదేవిధంగా యూత్ కు సందేశాన్ని కూడా అందించారు. అయితే ఆర్టీవీ ట్వీట్ తో పలువురు విమర్శనాత్మకంగా బదులిస్తారు. ఇలా అందరూ వీడిపోవడాన్ని సపోర్ట్ చేస్తే వారి పిల్లల భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఆర్జీవీ ఎప్పటికప్పుడూ ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తున్నారు.