Asianet News TeluguAsianet News Telugu

పవర్ స్టార్ అయిపోలేదు, చెబితే గూండాగిరి చేస్తారు: వర్మ

రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’  అనే సినిమా చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.   ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టింపచేసి పవన్ అభిమానులకు కోపం తెప్పించారు. 

RGV To Make Two More Films on Pavan kalyan
Author
Hyderabad, First Published Jul 27, 2020, 6:49 AM IST


ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’  అనే సినిమా చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.   ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టింపచేసి పవన్ అభిమానులకు కోపం తెప్పించారు. వాళ్లు పరాజన్నజీవి అనే సినిమా తీసి రిలీజ్ చేసే అంతలా రెచ్చగొట్టాడు. మొత్తానికి పవర్ స్టార్ రిలీజ్ తో అందరూ ఇక ఈ సినిమా కథ ముగిసిందనకున్నారు. కానీ వర్మ మాత్రం ఈ ఎపిసోడ్ ని సాగతీయాలని ఫిక్స్ అయ్యారు.

రామ్ గోపాల్ వర్మ ఓ టీవి ఛానెల్ తో మాట్లాడుతూ...తన సినిమాకు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చిందన్నారు. నేను కనుక పవర్ స్టార్ టిక్కెట్లు ఎన్ని అమ్ముడుపోయాయో చెప్తే చాలా మంది హార్ట్ ఎటాక్ లు వచ్చి పోతారు. వాళ్ల ఆరోగ్యం కోసం నేను ఆ వివరాలు రివీల్ చేయటం లేదు. అలాగే పవర్ స్టార్ సీరిస్ లో మరో రెండు సినిమాలు తీయాలనుకుంటున్నట్లు తెలియచేసారు. దాంతో ఇప్పుడు పవర్ స్టార్ సీరిస్ కథని ఏ కాన్సెప్టు తీసుకుని తెరకెక్కిస్తారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.  అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు.
 
ఇక తెలుగు సినిమా శివ ముందు.. శివ తరువాత ఎలాగైతే అయ్యిందో.. ఆన్ లైన్ థియేటర్స్‌లో ఆర్జీవీ ‘పవర్ స్టార్’ ముందు.. తరువాత అని చెప్పుకుంటారు. దీనికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అయితే ఇలా సొంతంగా సినిమాని ఆన్ లైన్‌లో రిలీజ్ చేయడం వల్ల.. ఇండస్ట్రీ నాపై బ్యాన్ విధిస్తుంది అంటూ ఛానల్స్ వాళ్లు  అంటున్నారు.. వాళ్లకి నేను ఫస్ట్ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధమే లేదు. నా ఇండస్ట్రీ ఒక్కటే.. అదే ఆర్జీవీ ఇండస్ట్రీ. నా కథ, నా సినిమా, నా టెక్నీషియన్స్, నా యాక్టర్స్.. అంతా కలిసి చేసిన సినిమా.. నా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు.. వాళ్లు బ్యాన్ చేయడానికి ఏం లేదు అని తేల్చి చెప్పారు.
  

Follow Us:
Download App:
  • android
  • ios