మధ్యమధ్యలో తన సినిమాల్లోనే కనిపించే ఆయన ... ఇప్పుడు బయిట సినిమాల్లోనూ నటించబోతున్నారు. గెస్ట్ గా కనిపించబోతున్నారు. అయితే అది మామూలు సినిమా అయితే చెప్పుకునే మ్యాటర్ కాదు. కానీ ఆ సినిమాలో హీరో ప్రభాస్ అయినప్పుడు అది హైలెట్ వార్త కాకుండా ఎలా ఉంటుంది.
రామ్ గోపాల్ వర్మ డైరక్షన్ ని లైట్ తీసుకుని మిగతా విషయాలపై దృష్టి పెట్టడం ఎప్పుడో మొదలైంది. తన సినిమాల్లో వాయిస్ ఓవర్ లు చెప్పటం, పాటలు రాయటం, పాడటం చేస్తున్నారు. అంతేకాదు నటనలోకి కూడా దిగారు కూడా. ఆ మధ్యన కోబ్రా అనే సినిమాలో డాన్ గా నటిస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించారు. అలాగే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపించారు. ఇలా మధ్యమధ్యలో తన సినిమాల్లోనే కనిపించే ఆయన ... ఇప్పుడు బయిట సినిమాల్లోనూ నటించబోతున్నారు. గెస్ట్ గా కనిపించబోతున్నారు. అయితే అది మామూలు సినిమా అయితే చెప్పుకునే మ్యాటర్ కాదు. కానీ ఆ సినిమాలో హీరో ప్రభాస్ అయినప్పుడు అది హైలెట్ వార్త కాకుండా ఎలా ఉంటుంది.
వివరాల్లోకి వెళితే.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ప్రబాస్ ప్రతిష్టాత్మకంగా భావించి నటిస్తున్న ప్రాజెక్ట్ కె నిర్మాతలు రామ్ గోపాల్ వర్మను ఒక చిన్న పాత్ర కోసం సంప్రదించారని వినికిడి. దానికి ఆయన ఓకే చెప్పినట్లు మీడియా వర్గాల సమాచారం. ప్రాజెక్ట్ K లో ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించనున్న వర్మ త్వరలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోనున్నారు. అయితే ఇందులో రామ్ గోపాల్ వర్మ తన నిజ జీవిత పాత్రలో కనిపించనున్నారు. వర్మ తెరపై కనిపించే పాత్ర ఏమై ఉంటుందనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశం. జాతీయ-అవార్డ్-విజేత దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ప్రాజెక్ట్ K ...ప్రభాస్ నటిస్తున్న అతి భారీ చిత్రాలలో ఒకటి.
పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ K మూవీ రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందా? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత అశ్వినీదత్ రెండు నెలల క్రితం ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ K (Project K)మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. వచ్చే దసరా సందర్బంగా అక్టోబర్ 18న ప్రాజెక్ట్ K మూవీని వరల్డ్ వైడ్‌గా విడుదల చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహానటి వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీని తెరకెక్కించిన నాగ్ అశ్విన్ (Nag Ashwin) చేస్తోన్న సినిమా కావటంతో పాటు ప్రభాస్‌కు తోడుగా అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan), దీపికా పదుకొనె (Deepika Padukone) వంటి భారీ తారాగణం కూడా ఇందులో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షనల్ మూవీగా ప్రాజెక్ట్ K ప్రేక్షకులను అలరించనుంది.
