బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కొడుకు బండి భగీరథ్‌ని ఇరాక్‌ నియంత సద్దాం హుస్సేన్‌ కొడుకుతో పోల్చాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ యూనివర్సిటీలో ఓ స్టూడింట్‌ని కొట్టిన వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆయన్ని ఇరాక్‌ నియంత సద్దామ్‌ హుస్సేస్‌ కొడుకుతో పోల్చాడు సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. స్టూడెంట్‌ శ్రీరామ్‌ని బండి భగీరథ్‌ కొడుతున్న వీడియోని ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ చేస్తూ ఆయన షాకింగ్‌ ట్వీట్‌ చేశారు. 

ఇందులో వర్మ చెబుతూ, `ఇరాక్‌ నియంత సద్దాం కుమారుడు ఉదయ్‌ హుస్సేన్‌ వంటి రోజులు ముగిశాయి, ఇప్పుడు అతను బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ రూపంలో పునర్జన్మ పొందాడని నేను అనుకుంటున్నా. బండి సంజయ్‌ని కుమారుడు ఎగతాళి చేశాడు` అంటూ ట్వీట చేశాడు వర్మ. దీంతో ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఏకంగా ఓ నియంతతో పోల్చడం పట్ల బీజేపీ వ్యతిరేక వర్గం వర్మకి మద్దతుగా కామెంట్లు పెడుతుంటే, బీజేపీ వర్గీయులు ఆయన్ని విమర్శిస్తూ పోస్ట్ లుపెడుతున్నారు. 

Scroll to load tweet…

అంతేకాదు ఇందులో మరో వీడియో అంటూ ఇంకో వీడియోని షేర్‌ చేశారు. ఇందులో భగీరథ్‌ తోపాటు అతన్ని స్నేహితులు మరో సందర్భంలో ఓ రూమ్‌లో కొడుతున్న వీడియో ఇది. ఒకరు ఆపుతున్నా, మరొకరు కొడుతూ కనిపించారు. ఈ వీడియో సైతం నెట్టింట రచ్చ లేపుతుంది. అయితే ఇది రాజకీయ రంగు పులుముకుంది. బండి సంజయ్‌ కొడుకు రౌడీయిజం అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రచ్చ చేస్తున్నారు. 

మరోవైపు దీనిపై పెద్ద షాక్‌ ఇచ్చాడు ఆ శ్రీరామ్‌ అనే కుర్రాడు, తాను భగీరథ్‌ ఫ్రెండ్‌ సిస్టర్‌ని ప్రేమించమని ఫోర్స్ చేశానని, రాత్రి సమయంలో ఫోన్లు, మెసేజ్‌లు చేశానని, అందుకే తనని కొట్టారని సెల్ఫీ వీడియోని పంచుకున్నాడు. మా మధ్య వివాదం సమసిసోయిందని, సమస్య పరిష్కారం అయ్యిందని, ఇష్యూ చేయడానికి ఏం లేదని అన్నారు. అయితే ఈ వీడియోపై కూడా విమర్శలు వస్తున్నాయి. బలవంతంగా, బెదిరించి ఆ అబ్బాయిచేత ఈ వీడియో పెట్టించారని ఆరోపిస్తున్నారు బీఆర్‌ఎస్‌ నాయకులు. మొత్తంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారుతుంది. ఇక బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ హైదరాబాద్‌లో ఆనంద్‌ మహీంద్రకి చెందిన మహేంద్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.