విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనంతరం క్యాస్ట్ ఫీలింగ్ పై ఒక కథను అల్లుతున్న విషయం తెలిసిందే. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేశాడు. అయితే ఇక సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టకముందే సినిమాకు సంబందించిన అప్డేట్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. 

పవన్ కళ్యాణ్ కి డూప్ ని సెట్ చేసి ఇప్పటికే పోటోలను వదిలాడు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు లుక్ ని కూడా తనదైన శైలిలో సెట్ చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ ఫొటోలో ఉన్న క్యారెక్టర్ ఎవరిదో గెస్ చేయండి అని నెటిజన్స్ కి తెలిసిన ఫజిల్ వదిలాడు. సోది లేకుండా నెటిజన్స్ చంద్రబాబు అని ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. 

అదే విధంగా డిఫరెంట్ గా కామెంట్స్ తో ఫోటో ను మరింత వైరల్ అయ్యేలా చేస్తున్నారు. నీకు ఈ క్యారెక్టర్ చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారయ్య? సామి.. చంద్రబాబుని దింపేసావ్ గా ఫొటోలో.. ఇప్పట్లో ఆయనను వదిలేలా లేవు అని కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా మరికొంత మంది ప్రముఖ రాజకీయ నాయకుల పోటోలను కూడా ఆర్జీవీ త్వరలో రిలీజ్ చేయనున్నాడు.