వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, విడుదల తేదీ వివరాలు రెండు రోజుల క్రితం (ఫిబ్రవరి, 25) ప్రకటించాల్సి ఉండగా.. వర్మ అభిమాన నటి శ్రీదేవి ఆకస్మిక మరణంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా, ఈ రోజు (మంగ‌ళ‌వారం) సాయంత్రం ఈ సినిమా టైటిల్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్ర‌క‌టించారు వర్మ.

నాగార్జున పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ కాంబోకి శ‌ప‌థం, గ‌న్‌, డిపార్ట్‌మెంట్ వంటి పేర్లు వినిపించగా.. వాటన్నింటినీ కాదని ‘ఆఫీసర్’ అనే క్యాచీ టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ప్రమోషన్‌లుక్‌లో బల్లపై పోలీస్ టోపీ, గన్, టీ గ్లాస్‌తో పాత వర్మను గుర్తు చేసిన వర్మ.. ఫస్ట్‌లుక్‌తో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన లొకేషన్ పోస్టర్స్ రివీల్ కావడంతో ఈ ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల్ని పెద్దగా థ్రిల్ చేయలేకపోయింది. ఇలాంటి భయపెట్టే పోలీసుని చూసి ఉండరు అంటున్న వర్మ ‘ఆఫీసర్’ ఫస్ట్‌లుక్‌లో పెద్ద పవర్ కనిపించలేదు.