హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి,


మెగా ఫ్యాన్స్, గరికపాటి వివాదం రోజుకొకరు చొప్పున ఆజ్యం పోసుకుంటూ పోతున్నారు. దాంతో ఈ వివాదం ఇప్పుడప్పుడే సర్దుమణిగేలా కనపడటంలేదు. ఇప్పటికీ చాలా మంది సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై విమర్శలు గుప్పిస్తున్నాన్నారు. ఇప్పుడు సీన్ లోకి రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చారు. ఆయన వ్యంగ్యంగా చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వర్మ ఏమన్నారు...

Scroll to load tweet…
Scroll to load tweet…

"మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు.. మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, త్తగ్గేదెలె..." అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. అనంతరం "హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో.." అని మరో ట్వీట్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతటితో ఆగకుండా "హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి" అని విమర్శించారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

గరికపాటిని విమర్శించవద్దని అభిమానులను నాగబాబు సోషల్ మీడియా వేదికా కోరగా.. ఆ ట్వీట్‌పై కూడా ఆర్జీవీ స్పందించారు. "సర్, నాగాబాబు గారు.. మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు" అని అన్నారు. "సర్ నాగబాబు గారు.. ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ఎందుకు ఇచ్చారు సర్ సర్ సర్ చిరంజీవి??" అంటూ ఆర్జీవీ సెటైర్ వేశారు. 

వివాద విషయానికి వస్తే... హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ అలయ్ బలయ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి నరసింహరావు కొంత అసహనం వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతుంటే చిరంజీవితో అభిమానులు ఫొటోలు దిగడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం చిరంజీవి కూడా గరికపాటి వద్దకు వచ్చిన వినయంగా నమస్కరించి, ఆయన ప్రవచనాలంటే తనకు ఎంతో ఇష్టమని, క్షమించమని అడిగారు. ఓ రోజు తన ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని ఆహ్వానించారు. చిరంజీవికి క్షమాపణలు కూడా చెప్పారు గరికపాటి. అయినా కూడా ఆయనను వదిలిపెట్టట్లేదు అభిమానులు.