Asianet News TeluguAsianet News Telugu

ఆయన పుట్టినరోజుకి నాకెందుకు దండేశారు.. ఆర్జీవీ కామెంట్స్ వైరల్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రతి అంశంపై వర్మ సెటైరికల్ గా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

RGV makes fun comments on Dasari kiran birthday
Author
First Published Nov 29, 2022, 7:36 PM IST

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రతి అంశంపై వర్మ సెటైరికల్ గా కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. తనపై తాను సెటైర్లు వేసుకోవడంలో కూడానా ఆర్జీవీ తర్వాతే ఎవరైనా. ఎలాంటి అంశంపై అయినా ఫన్ జనరేట్ చేస్తూ తన అభిప్రాయాలని ఫన్నీగా చెబుతుంటారు ఆర్జీవీ. 

తాజాగా ఆర్జీవీ తనపైన తానే సెటైర్ వేసుకుంటూ ట్వీట్ చేశాడు. తాజాగా ఆర్జీవీ నిర్మాత దాసరి కిరణ్ బర్త్ డే వేడుకలకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మని పెద్ద పూల మాలతో సత్కరించారు. దీనిపై ఆర్జీవీ ఫన్నీగా స్పందిస్తూ.. మా 'వ్యూహం' నిర్మాత దాసరి కిరణ్ బర్త్ డే కి నాకు ఎందుకు దండ వేశారో అర్థం కావడం లేదు. వెరీ హ్యాపీ బర్త్ డే దాసరి కిరణ్ కుమార్ అని వర్మ ట్వీట్ చేశారు. 

త్వరలో రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులపై 'వ్యూహం' అనే చిత్రం తెరకెక్కించబోతున్నారు. వర్మ పొలిటికల్ నేపథ్యంలో సినిమా తెరకెక్కిస్తే ఎలాంటి వివాదం అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఈ చిత్రంలో వర్మ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా వర్మ పవర్ స్టార్ అనే చిత్రం తెరకెక్కించారు. అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు లాంటి వివాదాస్పద చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు విడుదలయ్యేలా వ్యూహం చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ప్రకటించడానికి ముందు వర్మ ఏపీ సీఎం జగన్ ని కలసిన సంగతి తెలిసిందే. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios