దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. వర్మ ఆలోచనలు, నడవడిక అంతా ఇతరులకు భిన్నంగా ఉంటాయి. తన శిష్యుడు పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హిట్ కొట్టడంతో వర్మ కూడా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంటున్నాడు. మరి ఆర్జీవీ సెలెబ్రేషన్స్ అందరిలా ఉండవు కదా..

ఇస్మార్ట్ శంకర్ చిత్రం చూసేందుకు వర్మ మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ కు వెళ్ళాడు. అలా ఇలా కాదు.. బైక్ పై ట్రిపుల్ రైడ్ లో. ఆర్ఎక్స్ 100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ అగస్త్య, వర్మ ముగ్గురూ బైక్ పై థియేటర్ కు వెళ్లారు. హెల్మెట్ లేకుండా వెళుతున్నాం అని వర్మ ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు. 

ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్ తో కలసి వర్మ చేసిన సందడి అంతా ఇంతా కాదు. షాంపైన్ బాటిల్ వెదజల్లుతూ నానా హంగామా చేశాడు. ఆ వీడియో కూడా వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. షాంపైన్ బాటిల్ తలపై కూడా పోసుకున్నాడు. నెను పిచ్చివాడిని కాదు.. కానీ ఇస్మార్ట్ శంకర్ చూశాక నా సంతోషం హద్దులు దాటింది అంటూ వర్మ ట్వీట్ చేశాడు.