ఇటీవల మంగళగిరిలో జరిగిన మీటింగ్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తనను ఓడించడానికి అసెంబ్లీలో అడుగుపెట్టాడనివ్వకుండా ఉండటానికి 150కోట్ల వరకు ఖర్చు చేశారని పవన్ చేసిన కామెంట్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. 

పవన్ చేసిన కామెంట్స్ జనాలను అవమానించేలా ఉన్నాయని, ఎవరిదగ్గర ఎంత డబ్బు తీసుకున్నా కూడా పవన్ ని నిజంగా గెలిపించాలని అనుకునేవారు అతనికే ఓటు వేసేవారని నిజంగా ఈ వ్యాఖ్యలు జనాల నిర్ణయాన్ని తప్పుబట్టేలా ఉన్నాయని వర్మ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. 

పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయడానికి ప్రతి నియోజకవర్గంలో పవన్ చర్చలు జరుపుతున్నాడు. ఇక తాను సినిమాల్లోకి వెళ్లకుండా రాజకీయాల్లోనే కొనసాగుతానని వివరణ ఇచ్చారు.