టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఆదివారం తన  AMB సినిమాస్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బిజినెస్ పాట్నర్స్ సమక్షంలో సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా మహేష్ మల్టిప్లెక్స్ ను స్టార్ట్ చేశాడు. ఇక నిన్న సాయంత్రమే షోలు కూడా మొదలయ్యాయి. 

హైదరాబాద్ లో మొదటి సారి అత్యంత టెక్నాలిజీ మరియు స్టైలిష్ థియేటర్స్ గా AMB ని నిర్మించినట్లు ఇప్పటికే చూసిన వారు కొనియాడుతున్నారు. ఇక ఈ థియేటర్ లో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా కూడా చూసేశాడు. అంతే కాకుండా ఈ మల్టిప్లెక్స్ లో ఒకే ఒక్క ప్రాబ్లమ్ ఉందని తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. 

‘‘మహేష్  ‘ఏఎంబీ’ సినిమాస్‌‌ లో ఒక మూవీ చూశాను. ఈ సూపర్ ప్లెక్స్ థియేటర్ లో ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లమ్ ఏమిటంటే.. ఇలాంటి వండర్ఫుల్ థియేటర్ స్థాయికి తగ్గట్టు సినిమా రావడం చాలా కష్టమని నిజంగా ఈ థియేటర్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అంటూ వర్మ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇక వర్మ భైరవగీత కన్నడలో 7న రిలీజ్ అవుతుండగా న తెలుగులో 14న రిలీజ్ కానుంది.