విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ విజయవాడలో అడుగుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 31న సినిమాను విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. గత కొంత కాలంగా నా సినిమాను కావాలని అడ్డుకుంటున్నారని కొన్ని రోజుల క్రితం ఇదే ప్లేస్ లో సినిమా విడుదల కోసం రాగా బలవంతంగా అరెస్ట్ చేశారని అన్నారు. 

సినిమా లెట్ అవ్వడానికి కారణం.. సైకిల్ చాలా జోరుగా తిరుగుతోంది కాబట్టి పంక్చర్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెబుతూ ఇప్పుడు మాత్రం థియేటర్ లో ఏపీ ప్రజలకు నిజాన్ని చూపించబోతున్నట్లు చెప్పారు. ఇది నచ్చక చాల మంది సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

ఇక ఈ కథను తెరపై చూపించడానికి ప్రధాన కారణం..  25 ఏళ్ల తరువాత కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని ఓట్లడుగుతున్నారు. అది మెయిన్ గా తెరమీద చూపించాలని అనుకున్నానని వర్మ సమాధానం ఇచ్చారు. అనంతరం పాలిటిక్స్ గురించి తనకు ఎక్కువ తెలియదని ఎవరి గురించి కామెంట్ చేయనని వర్మ మాట్లాడారు.