డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV)కు సంబంధించిన ‘రామూయిజం’ ఎపిసోడ్స్ నుంచి ‘బ్లూ బుక్’ అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ బుక్ ను ఫిబ్రవరి 18న రిలీజ్ చేయనున్నట్టు ఆర్జీవీ వెల్లడించారు.
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ‘రామూయిజం’ ఎపిసోడ్స్ ల నుంచి పలు అంశాలను స్వీకరించి ‘బ్లూ బుక్’ అనే పుస్తకాన్ని అచ్చు వేయించారు. గతంలోనూ రామ్ గోపాల్ వర్మ రాసిన ‘నా ఇస్టం’ పుస్తకం ఎంత సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీనికంటే ముందు ‘గన్స్ అండ్ థైస్’, ‘వోడ్కా విత్ వర్మ’ వంటి పుస్తకాన్ని కూడా రామ్ గోపాల్ వర్మే రచించారు. వోడ్కా విత్ వర్మ పుస్తకాన్ని స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లాంచ్ చేయనున్నారు. ఈ బుక్స్ కు పుస్తక ప్రియుల నుంచి మంచి రెస్సాన్సే వచ్చింది. పలువురు నుంచి ఫీడ్ బ్యాక్ కూడా వచ్చినట్టు ఆర్టీజీ పలు సందర్భాల్లో తెలియజేశాడు.
అయితే ఇటు సినిమాలు, అటు ఇంటర్వ్యూలతో బీజీగా గడుపుతున్న ఆర్టీవీ.. గతంలో యాంకర్ స్వప్నతో కలిసి టెవిజన్ టాక్ షో ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏదేని అంశంపై యాంకర్ స్వప్న (Anchor Swapna) సంధించే ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ తన పాయింట్ ఆఫ్ వ్యూలో సమాధానాలు చెప్పారు. ఈ షోకు ‘రామూయిజం’ అనే టైటిల్ పెట్టారు. ఈ టాక్ షోలో ‘భయం, చావు, తెలివి, సెక్స్, దేవుడు, చదువు, దేశభక్తి, క్రైమ్, కోసం, స్త్రీ, ఫిలాసఫీ, సినిమా, మతం, పురాణాలు, పిల్లలు’ వంటి అంశాలపై ఆర్జీవీ ఆలోచన విధానాన్ని తెలిపే ఇంటర్వూలను మనం చూడొచ్చు.
అయితే ఈ టాక్ షోకు య్యూటూబ్ లో అప్పట్టో పెద్ద ఎత్తున రెస్సాండ్ వచ్చింది. ఆర్జీవీ లాజికల్ క్వశ్చన్స్, ఆన్సర్స్ కు సోషల్ మీడియా యూజర్లు ఫిదా అయ్యే వారు. ఇలా ఆర్జీవీ ఇంపాక్ట్ కూడా చాలా మందిపైనే పడిందని చెప్పొచ్చు. అయితే ఈ రామూయిజం ఎపిసోడ్స్ నుంచి కొన్ని అంశాలను సేకరించి ‘ఆర్జీవీ బ్లూ బుక్’ (RGV'S BLUE BOOK)ను ప్రచురించారు. మొట్టమొదట చేతితో రాసి ప్రచురించడం ఈ పుస్తకం ప్రత్యేకత. ఆర్టిస్ట్ కాంత్ రిసా ఈ పుస్తకాన్ని రాయడం, డ్రాయింగ్స్ వేసే పనులను పూర్తి చేశాడు. కాగా ఈ పుస్తకం కవర్ పేజీ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. సగ భాగం మునిని పోలిన ఆర్జీవీ ఫొటో ఆసక్తిగా ఉంది.
ఈ పుస్తకం గురించి ఆర్జీవీ మాట్లాడుతూ ‘ ఈ పుస్తక ప్రచురణలో నా ప్రమేయం లేదు.. తనకు నచ్చిన, నన్ను ద్వేషించే ఏ కారణాల వల్ల అయినా ఐవ్యూ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలసి ఆర్టిస్ట్ కాంత్‌రిసా స్వయంగా ప్రచురించారు. ఫిబ్రవరి 18న సాయంత్రం 5 గంటలకు రాక్ హైట్స్, శిల్పారామంలో పుస్తక ఆవిష్కరణ జరగనుంది’ అంటూ పేర్కొన్నాడు. అయితే ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయాలంటే ఆర్జీవీజూమ్ ఇన్ లో పోస్ట్ చేయబడిన బ్లూ బుక్ స్కానర్ ను స్కాన్ చేసి కాపీలను ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపారు.
