సోషల్ మీడియాలో అందరూ ఒక దారిలో వెళుతుంటే విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం డిఫరెంట్ స్టైల్ లో వెళతాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో ఉన్న మెగా అభిమానులకు చిరాకు తెప్పించేలా పవన్ కళ్యాణ్ కి సంబందించిన పోస్టర్ ని వదిలి తన ట్వీట్ తో కొత్త తరహా వివాదానికి తెర లేపాడు.

రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా చేస్తున్నట్లు ఎనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఒక కొత్త నటుడు చేయబోతున్న పాత్ర ఎవరిదో ఊహించగలరా అంటూ పవన్ కళ్యాణ్ స్టైల్ లో నిలబడిన కొత్త నటుడు ఫోటోని పోస్ట్ చేశాడు వర్మ. దీంతో ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వర్మ ఆ పాత్ర గురించి చెప్పకుండా నెటిజన్స్ అడగడంతో నెటిజన్స్ పవన్ కళ్యాణ్ అని కామెంట్ చేస్తున్నారు. మరి వర్మ తన సినిమాలో ఈ పాత్రను ఎలా చూపిస్తాడో చూడాలి.
Can anybody guess which role this new actor is playing in KAMMA RAJYAM LO KADAPA REDDLU? #KRKR pic.twitter.com/Vkqu8aGkgA
— Ram Gopal Varma (@RGVzoomin) August 22, 2019
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 22, 2019, 12:56 PM IST