Asianet News TeluguAsianet News Telugu

‘ప‌వ‌ర్ స్టార్’ ట్రైలర్ లీక్ : వర్మ ఏమంటారంటే!

వివాదాస్పద సబ్జెక్టు కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో వర్మ తన తాజా చిత్రం ట్రైలర్ చూడటానికి సైతం రేటు ఫిక్స్ చేసారు. వ్యంగ్యాత్మక మూవీగా క‌నిపిస్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్ జూలై 22న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల కానుందంటూ ప్రకటన చేసారు. అయితే ఈ లోగా ట్రైలర్ లీకైంది. నాలుగు నిమిషాలు నిడివి కలిగిన ఈ ట్రైలర్ అంతటా వైరల్ అవుతోంది.

RGV announces will return Money for Power Star trailer
Author
Hyderabad, First Published Jul 22, 2020, 10:44 AM IST

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’  అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.   ఇందులో అచ్చంగా హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను పోలిన వ్యక్తి హీరోగా న‌టిస్తున్నారు.వివాదాస్పద సబ్జెక్టు కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ నేపధ్యంలో వర్మ తన తాజా చిత్రం ట్రైలర్ చూడటానికి సైతం రేటు ఫిక్స్ చేసారు. వ్యంగ్యాత్మక మూవీగా క‌నిపిస్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్ జూలై 22న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల కానుందంటూ ప్రకటన చేసారు. అయితే ఈ లోగా ట్రైలర్ లీకైంది. నాలుగు నిమిషాలు నిడివి కలిగిన ఈ ట్రైలర్ అంతటా వైరల్ అవుతోంది.

ఇక  ఈ సినిమా ట్రైలర్‌కు రూ. 25 పెట్టి చూడాలని వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించగా.. ఇప్పుడు ఆ ఖర్చు లేకుండానే యూట్యూబ్‌లో ‘పవర్‌స్టార్‌’ ట్రైలర్ లీక్ కావటంతో వర్మ మరో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో  ప్రకటన చేసారు.  ”ప‌వ‌ర్‌స్టార్ ట్రైల‌ర్ లీక్ కావ‌డం వ‌ల్ల గంటలో అఫీషియల్ వెర్షన్‌ను యూట్యూబ్‌లో విడుద‌ల చేస్తామన్నారు. అంతేకాకుండా ట్రైల‌ర్‌కి డ‌బ్బులు క‌ట్టిన వారికి తిరిగి చెల్లిస్తామ‌ని తెలిపారు”.  

 
 ఈ సినిమాలో  పీకే, ఎమ్‌ఎస్, ఎన్‌బీ, టీఎస్, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవడానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు  అని వర్మ వెటకారంగా అన్నారు. అలాగే ఈ సినిమా గురించి కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి వీడియోను కూడా విడుదల చేసి, ‘‘నా ‘పవర్‌ స్టార్‌’ చిత్రంలో నటించే హీరో ఇతనే. అతను మా కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ షాట్‌ చిత్రీకరించాం. ఇతన్ని ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తే అది యాధృచ్చికమే’’ అని కూడా వర్మ ట్వీట్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios