Asianet News TeluguAsianet News Telugu

ట్రైలర్ దుమ్ము రేపింది: వర్మ హాట్ మార్షల్ ఆర్ట్స్ 'అమ్మాయి'!

ఇండియాలోని ఫస్ట్ ఫిమేల్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో పూజ భలేఖర్ హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమవుతుంది.   

Rgv AMMAYI Trailer released
Author
Hyderabad, First Published Nov 14, 2021, 10:55 AM IST

ఎప్పటికప్పుడు ఏదో ఒక సెన్సేషన్ తో ముందుకెళ్లే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''లడకీ''. 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్'  ట్యాగ్ లైన్. ఇండో-చైనీస్ జాయింట్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చైనాలో 'డ్రాగన్ గర్ల్' అనే పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీ.. తెలుగులో ''అమ్మాయి'' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.  ఇండియాలోని ఫస్ట్ ఫిమేల్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో పూజ భలేఖర్ హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమవుతుంది.  ఈ చిత్ర ట్రైలర్ హిందీ, చైనా లో రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది.  తెలుగు ట్రైలర్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంది మీరూ ఓ లుక్కేయండి.

 

మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ఫైటర్ గా మారిన ఓ యువతి జీవితంలో చోటుచేసుకున్న సంఘటన సమూహారమే ఈ సినిమా అని తెలుస్తోంది.  బ్రూస్ లీ అంటే పిచ్చిగా అభిమానించే పూజా అనే అమ్మాయి.. ఆయనలా మార్షల్ ఆర్ట్స్ లో నెంబర్ వన్  గా మారాలనుకొంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని ఒక అమ్మాయి ఎలా ఎదుర్కొంది.. చివరికి తాను అనుకున్నది సాధించిందా..? లేదా..? అనేది కథగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ లో వర్మ మార్క్ పక్కా కనిపిస్తోంది. పూజా భలేకర్ ఒకపక్క ఫైటర్ గా.. మరోపక్క హాట్ హాట్ అందాలను చూపిస్తూ ప్రియుడితో రొమాన్స్ చేసే అమ్మాయిగా ఆకట్టుకొంది.  

యాక్షన్ తో పాటుగా ఆర్జీవీ తర్వాత లవ్ - రొమాన్స్ వంటి కుర్రకారుని ఊర్రూతలూగించే మసాలా అంశాలన్నీ 'అమ్మాయి' సినిమాలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.  ఇప్పుడు ట్రైలర్ నెట్టింట హీట్ పెంచేసింది.

''అమ్మాయి'' ఇండియాలోనే ఫస్ట్ రియలిస్టిక్ మార్షల్ ఆర్ట్స్ మూవీ అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. బ్రూస్ లీ 'ఎంటర్ ది డ్రాగన్' సినిమా స్పూర్తితో ఆర్జీవీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ను పూజా భలేకర్ - వర్మ కలిసి డిజైన్ చేశారు. రవి శంకర్ - డీఎస్ఆర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. మాలహార్ భట్ జోషి సినిమాటోగ్రఫీ అందించారు. చైనాకు చెందిన బిగ్ పీపుల్ సంస్థతో కలిసి ఆర్ట్ సి మీడియా - పారిజాత మూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios