Asianet News TeluguAsianet News Telugu

RGV : వర్మ యూటర్న్... క్యాసినో వివాదంలోకి ఎన్టీఆర్ ని లాగేసేడే

రాంగోపాల్ వర్మ వేగంగా  గుడివాడ అభివృద్ధికి పాటుపడుతోన్న మంత్రి కొడాలి నానికి నా ధన్యవాదాలు. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. విమర్శలను పట్టించుకోవద్దు' అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశాడు.

RGV again tweet about GUDIVADA casino life style
Author
Hyderabad, First Published Jan 24, 2022, 11:05 AM IST


వర్మ అంటేనే వివాదాలు మయం. ఎప్పుడో ఏదో ఒక వివాదంతో జనాలు నోట్లో నానుతూంటారు. తనకు సంభందం ఉన్నా లేకపోయినా ..కనపడే  ప్రతి విషయంపై స్పందిస్తూ తనదైన స్లైల్ లో కామెంట్స్ చేస్తూ  వివాదాలకు కారణం అవుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఎన్నో అంశాల గురించి స్పందిస్తున్నారు. దీంతో సహజంగానే వార్తల్లోనే నిలుస్తున్నాడు.మొన్నటిదాకా టిక్కెట్లు విషయమై మాట్లాడిన ఆయన గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతోన్న గుడివాడ క్యాసినో వివాదంపై రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేస్తున్నాడు. తాజాగా ఇందులోకి నందమూరి తారక రామారావును లాగుతూ ఈ సంచలన దర్శకుడు ట్వీట్లు చేశాడు.
   
వివరాల్లోకి వెళితే...గుడివాడలో క్యాసినో సెంటర్లు ఏర్పాటు చేయడం వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి కొడాలి నాని హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  ప్రతిపక్షంవారైన తెలువగుదేశం వారు ఈ విషయాన్ని  బాగా హైలైట్ చేయడంతో పాటు సదరు మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. దీంతో స్వయంగా నాని స్పందించి.. క్యాసినో సెంటర్ల వ్యవహారంలో తన హస్తం ఉందని నిరూపిస్తూ ఆత్మహత్య చేసుకుంటానన్నారు.
 
ఈ క్రమంలోనే దర్శకుడు రాంగోపాల్ వర్మ వేగంగా  గుడివాడ అభివృద్ధికి పాటుపడుతోన్న మంత్రి కొడాలి నానికి నా ధన్యవాదాలు. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. విమర్శలను పట్టించుకోవద్దు' అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేశాడు. అలాగే 'గుడివాడను లండన్, లాస్‌వెగాస్‌, పారిస్‌ లాంటి దేశాల లిస్టులో ఉంచేందుకు కొడాలి నాని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు ఆయనను తప్పకుండా మెచ్చుకోవాలి'.. 'గోవాలో ఉన్న క్యాసినో సంస్కృతిని ఏపీలోని గుడివాడకు తీసుకొచ్చిన నానిని ఎందుకు విమర్శిస్తున్నారు?' అంటూ  వెటకారం చేసారు.

ఈ వివాదంలోకి తాజాగా  సీనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు'ను లాగుతూ వర్మ వరుస ట్వీట్లు చేశాడు. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది.  రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో 'యమగోల' సినిమాలోని గుడివాడ వెళ్లాను అనే స్పెషల్ సాంగ్‌ను షేర్ చేశాడు. దీనికి 'గుడివాడలో క్యాసినో ఎన్టీ రామారావు పర్యవేక్షణలో 1977లోనే మొదలైంది' అంటూ విచిత్రమైన అంశాన్ని లేవనెత్తాడు. అంతేకాదు, 'నేను మొదటిసారి జయమాలిని ద్వారా గుడివాడ క్యాసినో గురించి విన్నాను' అంటూ చమత్కరించాడు.
 
మరో ట్వీట్‌లో వర్మ 'క్యాసినోను ముందుగా ఎన్టీఆరే అనుమతించారు కాబట్టి టీడీపీ వాళ్లు ఆయననే ప్రశ్నించాలి. ఒకవేళ టీడీపీ వాళ్లు మంత్రి కొడాలి నాని ప్రశ్నించాలి అనుకుంటే.. ఆయన కంటే ముందే ఎన్టీఆర్‌ను డిమాండ్ చేయాలి. ఎందుకంటే తన సినిమాల్లో ఇలాంటి వాటిని అనుమతించింది ఆయనే కాబట్టి' అంటూ సెటైరికల్‌గా పోస్ట్ చేశాడు.అయితే ఏమైందో ఏమో వాటిని డిలేట్ చేసేసారు. కానీ స్క్రిన్ షాట్స్   వైరల్ అవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios