నిన్నటి వారికి ట్విట్టర్ లో పాలిటిక్స్ గురించి తెగ కామెంట్స్ చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫైనల్ ప్రెస్ ముందుకు వచ్చి తనదైన శైలిలో కౌంటర్లు వదిలాడు. రాజకీయాల గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పిన వర్మ జనసేన విజయాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. 

జనసేనతో పోలిస్తే ప్రజారాజ్యం బాహుబలి అని అంటూ జనసేన విజయంతో పోలిస్తే 18 రేట్లు బలమైందని అప్పటి ఎలక్షన్స్ ని గుర్తు చేశారు. ఇక వాటి గురించి ఎక్కువగా వివరణ ఇవ్వని వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. నాగబాబు ఓటమిపై కూడా వర్మ మాట్లాడానని చెబుతూ.. అసలు తనకు పాలిటిక్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదని ఆయన ఎక్కడ నుంచి పోటీ చేశారో కూడా తెలియదని అన్నారు. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ ను ఏపీలో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపిన ఆర్జీవీ సినిమాలో అన్ని కోణాల్లో నిజాల్ని చూపించినట్లు తెలిపారు.