Asianet News TeluguAsianet News Telugu

ఊహించని పరిణామాలతో కెప్టెన్‌గా రేవంత్‌ విన్నర్.. బాలాదిత్యకి కోపం వచ్చింది.. గీతూపై అంతెత్తున..

సూర్య, బాలాదిత్య, రేవంత్‌ కెప్టెన్సీ పోటీలో ఉన్నారు. వీరు ఇంటి సభ్యులను కన్విన్స్ చేసుకుని వారి మెప్పుపొంది వారి మద్దతుని బంతిపూల దండల రూపంలో తమ మెడలో వేయించుకోవాలి.

revanth fifth captain in big boss6 house baladitya fire on geetu royal
Author
First Published Oct 7, 2022, 11:33 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 6వ సీజన్‌ ఒకింత డల్ గా, మరికాస్త హాట్ గా సాగుతుంది. చాలా వరకు పసలేని గేమ్‌లతో షో సాగుతుందని, ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గిపోతుందనే విమర్శల నేపథ్యంలో నాలుగు వారాలు పూర్తి చేసుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఐదో వారం కూడా చివరి దశకు చేరుకుంది. 33వ రోజు బిగ్‌ బాస్‌ ఎపిసోడ్ ఆరో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ కొనసాగుతుంది. గత టాస్క్ లోని టాప్‌ ముగ్గురు సభ్యులు కెప్టెన్సీ కోసం పోటీ పడాల్సి ఉంటుంది. 

అందులో భాగంగా సూర్య, బాలాదిత్య, రేవంత్‌ కెప్టెన్సీ పోటీలో ఉన్నారు. వీరు ఇంటి సభ్యులను కన్విన్స్ చేసుకుని వారి మెప్పుపొంది వారి మద్దతుని బంతిపూల దండల రూపంలో తమ మెడలో వేయించుకోవాలి. అందుకోసం ఇంటి సభ్యులతో మాట్లాడుకుని కన్విన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొదటగా చూసినదాన్ని బట్టి సూర్య విన్నర్‌ అవుతాడని అంతా అనుకున్నారు. రేవంత్ కి వ్యతిరేకంగా కామెంట్లు వినిపించాయి. ఆ తర్వాత బాలాదిత్యకి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కొందరు అనుకున్నారు. దీంతో బాలాదిత్య కెప్టెన్‌ అవుతారని ఊహించారు.

కానీ ఊహించని రీతిలో రేవంత్‌కి ఎక్కువ సపోర్ట్ దక్కడం విశేషం. సూర్య, బాలాదిత్య కంటే రేవంత్‌కి ఎక్కువ మంది సభ్యులు సపోర్ట్ చేశారు. కెప్టెన్‌ అయితే ఆయనలో మార్పు వస్తుందని, సహనం వస్తుందని, అందరిచేత బాగా పనిచేయించాలని, కెప్టెన్‌ అయితే ఎంత కష్టం ఉంటుందో తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ మంది సభ్యులు రేవంత్ కి మద్దతు పలికారు. దీంతో కెప్టెన్‌గా విన్నర్‌ అయ్యారు. అయితే సూర్య ఎంతో కన్విన్స్ చేసిన ఇనయ ఆయన్ని మోసం చేయడంతో బాగా హార్ట్ అయ్యాడు సూర్య. కానీ తమ ఫ్రెండ్‌షిప్‌ కి మాత్రం డోకా లేదని వెల్లడించారు. అయితే సూర్యని పట్టుకుని ఇయన కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. 

మరోవైపు ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. సభ్యులను రెండు గ్రూపులగా విడగొట్టి, ఇద్దరికి బెల్ట్ తో యాడ్‌ చేసి బలం ఉన్న వాళ్లు తమకు కేటాయించిన వస్తువులను బుట్టలో వేయాల్సి ఉంటుంది. ఎక్కువ వేసి, వాటిని ఫ్రిజ్‌లో ముందుగా పెట్టిన వారిని విన్నర్‌గా చేస్తారు. ఇందులో గీతూ టీమ్ విజయం సాధించింది. 

 అంతకు ముందు వసంతి, అర్జున్‌ కలిసి ముచ్చటించారు. ప్రేమ పాఠాలు చెప్పుకున్నారు. శ్రీ సత్యతో అర్జున్‌కి దూరం కావడంతో ఇప్పుడు వాసంతితో పులిహోర కలిపే ప్రయత్నం చేసింది. ఇది హైలైట్‌గా నిలిచింది. బిగ్ బాస్‌ 6 తెలుగు ప్రారంభమై 34 రోజులు అవుతుంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. నాలుగు వారాల్లో షాని, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios