నటిగా తన టాలెంట్ నిరూపించుకున్న రేణుదేశాయి అనంతరం పవన్ కళ్యాణ్ సతీమణిగా ప్రేమపెళ్లి చేసుకుంది. అయితే అనుకోని కారణాలవల్ల రేణు దేశాయి పవన్ కళ్యాణ్ విడిపోయారు. ఇక కొంత గ్యాప్ తర్వాత మళ్లీ బుల్లితెరపై ప్రసారమయ్యే నీతోనే డ్యాన్స్ షోకు జడ్జిగా ప్రేక్షకులముందుకొస్తున్నారు రేణు దేశాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్చూ ఇచ్చారు.

 

జీవిత భాగస్వామి లేకుండా అంటే ఒంటరిగా జీవించడం చాలా కష్టమని, అయినా ముందుకు సాగాల్సిందేనని హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ అభిప్రాయపడింది. ఇక ఇది నా కమ్ బ్యాక్ అని అనకూడదని అంటోంది రేణు దేశాయ్. “మానసికంగా నేను ఇక్కడే ఉన్నాను. కానీ పనిచేయలేదు. కెరీర్ పరంగా బ్రేక్ తీసుకొన్నాను. అంతమాత్రాన కమ్ బ్యాక్, రీ ఎంట్రీ అనకూడదు. నేను స్ట్రాంగ్ ఉమెన్ జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పడు వైఫల్యాలు నాపై అధిపత్యం సాగించడం ఇష్టముండదు. మొదట్లో కొంత బెరుకగా ఉన్నప్పటికీ.. పరిస్థితులు నన్ను స్ట్రాంగ్ ఉమెన్‌గా మార్చింది.” అన్నారామె.

 

సింగిల్ ఉమన్‌గా ఉండటం ఎంత కష్టమో అనుభవిస్తుంటే తెలుస్తోందని అభిప్రాయపడింది. అన్ని విషయాలను తానే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సమస్యను తానే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయినా... జీవితంలో మనం తీసుకొన్న నిర్ణయాలను బట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. నాకు ఎదురైన సమస్య గురించి ఆలోచించుకుంటే అలా జరుగకుండా ఉంటే బాగుండేదని అనుకొంటాను. ఇప్పటికీ అది నా జీవితంలో ఓ పెద్ద ప్రశ్నే. అయితే నేను తీసుకొన్న నిర్ణయానికి ఎలాంటి బాధపడటం లేదు అని పవన్ కల్యాణ్‌తో విడిపోవడంపై పరోక్షంగా సమాధానమిచ్చారు.

 

ఎన్ని కష్టాలు ఎదురైనా, జీవితంలో ఏనాడు అబద్ధం చెప్పవద్దనే విషయాన్ని నా తల్లి చిన్నప్పుడే తనకు నేర్పించింది. ఇప్పటికీ తల్లి మాటలను అనుసరిస్తున్నాను. అమ్మ చెప్పిన మాటను అనుక్షణం ఆచరిస్తున్నాను. ఏనాడూ అబద్ధం చెప్పలేదన్నారు. ఇక తన కుమారుడు అకీరా, నేను ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారట. కూతురు ఆద్య మాత్రం తనకు కొంచెం తల్లి అనే ఫీలింగ్ ఇస్తుంది. సుఖం, దుఖాలను సమానంగా తీసుకునే ప్రజ్ఞ ఉంది అని రేణుదేశాయ్ చెప్పింది.

 

మరోవైపు తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు మరో పెళ్లి చేసుకోవాలా అనే ఆలోచన కూడా తడుతుంటుందని, ఇప్పటిదాకా నో పెళ్లి, నో రిలేషన్ షిప్ అనుకునే దాన్నని, అయితే ఆలోచన ఆరోగ్యం బాగోలేనప్పుడు తడుతోందని, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందని వేదాంతం వళ్లించింది రేణు దేశాయి.