పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక తన ఇద్దరి పిల్లలతో కలిసి జీవిస్తున్న రేణుదేశాయ్...రకరకాల క్రియేటివ్ పనుల్లో తనను తాను బిజీ చేసుకుంటుున్నారు. మరో ప్రక్క  పిల్లల్ని పెంచుతూ.. వాళ్లు చేసే అల్లరిని, వారి సరదా సంగతుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు రేణూ దేశాయ్. బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగానే ఉన్న తాజాగా అల్లు అరవింద్ కు సంభందించిన ఆహా ఓటీటికు పని చేయబోతున్నట్లు సమాచారం. 

గత కొంతకాలంగా పూర్తిగా తెలుగు కంటెంట్‌ తో వచ్చిన ఆహా వెబ్‌ సిరీస్‌ లను వరుసగా నిర్మిస్తూ వస్తోంది. ఇప్పటికే పలు వెబ్‌ సిరీస్‌ లను మొదలు పెట్టిన ఆహా ఇప్పుడు మరో వెబ్‌ సిరీస్‌ కు ప్లాన్‌ చేసినట్లుగా సమాచారం. ఆ వెబ్‌ సిరీస్‌ లో ముఖ్య పాత్రను రేణు దేశాయ్‌ పోషించబోతోందని తెలుస్తోంది. ఇదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఓ కొత్త దర్శకుడు ఈ వెబ్‌ సిరీస్‌ తో పరిచయం కాబోతున్నారు. ఈ వెబ్ సీరిస్ కంటెంట్ నచ్చి రేణు దేశాయ్ నటిస్తున్నట్లు వినపడుతోంది. అయితే అధికారికంగా ఏ వార్త లేదు.  

రేణుదేశాయ్ నటనకు గుడ్‌బై చెప్పి చాలా కాలం అయ్యింది. అయినా ఆమె సినిమాలను డైరెక్ట్ చేస్తూనో, ప్రొడక్షన్‌ చేస్తూ అదేవిధంగా సామాజిక కార్యకలాపాలను చేపడుతూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె చేసిన ఒక పని అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. 

మరోవైపు మహేష్‌బాబు సినిమాలో రేణుదేశాయ్‌ నటించబోతున్నారని వస్తున్న వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘నేను విన్న అతి పెద్ద  బేస్‌లేస్‌ రుమార్‌ ఇది. రెండు మూడు రోజుల నుంచి చాలా మంది నాకు కాల్స్‌‌ చేసి విష్‌ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసినవారికి హ్యాట్సాఫ్‌. కానీ ఈ సినిమాతో నాకు పూర్తిగా సంబంధం లేదు.

 ఇంత పెద్ద సినిమా ఒప్పకున్నప్పుడు తప్పనిసరిగా నేను ప్రకటన చేస్తాను. నాకు నటించాలనే ఉంది. గతంలో ఓ సందర్భంలో మదర్‌ రోల్‌ గురించి అడిగినప్పుడు.. హీరో చిన్నప్పటి క్యారెక్టర్‌లకు తల్లిగా చేసేందకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. దాన్ని బేస్‌ చేసుకుని ఎవరో ఇలాంటి వార్తలు సృష్టించారు’ అని రేణు వెల్లడించారు.