పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌కి మళ్లీ చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల తాను కరోనా బాధితులకు, ఇబ్బందుల్లో ఉన్న వారికి నిత్యవసర సరుకులు అందిస్తున్న విషయం తెలిసిందే. తన వంతుగా సాయం చేస్తుంది రేణు దేశాయ్‌. ఎమర్జెన్సీగా ఉన్న కరోనా పేషెంట్లకి ఆక్సిజన్‌ బెడ్స్, వెంటిలేటర్‌ అందేలా చర్యలు తీసుకుంటుంది. అయితే ఇటీవల ఉన్న వారికే సాయం చేస్తారు. మాలాంటి మధ్య తరగతి, పేద వారిని పట్టించుకోరని ఓ నెటిజన్ రేణుని ప్రశ్నించారు. దీనికి ఘాటుగా స్పందించింది రేణు. తనకు అందరు సమానమే అని పేర్కొంది. 

తాజాగా మరో వ్యక్తి తనకు ఆర్థిక సాయం చేయకపోతే చచ్చిపోతానంటూ బెదిరింపులకు దిగారని తెలిపింది. మెసేజ్‌లు చేసి మరీ బెదిరింపులకు దిగుతున్నట్టు రేణు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె స్పందిస్తూ, ఇలాంటి మెసేజ్‌లు చేస్తే పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించింది. తను ఎవరికీ ఆర్థిక సాయం చేయలేనని స్పష్టం చేసింది. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు, నిత్యావసరాలు మాత్రమే అందించగలనని పేర్కొంది. 

రేణు సెకండ్‌ ఇన్సింగ్స్ ప్రారంభించి కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె జీ తెలుగులో `డ్రామా జూనియర్స్ ` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఇటీవల తన కూతురు ఆధ్యని పరిచయం చేసి పవన్‌ ఫ్యాన్స్‌ ని సర్‌ప్రైజ్‌ చేసిన విషయం తెలిసిందే.