చాలు ఆపండి.. ఇక ఆ నెగెటివిటీకి దూరంగా ఉంటా: రేణూ దేశాయ్‌

Renu desai upset with trolling her
Highlights

ఇక ఆ నెగెటివిటీకి దూరంగా ఉంటా

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రేణూ దేశాయ్‌ దూర‌మైనప్పటి నుండి ఆమె విపరీతంగా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ప‌వ‌న్‌కు అభిమానులు సోష‌ల్ మీడియాలో రేణుపై  చేస్తూనే ఉన్నారు. ప‌వ‌న్ అభిమానలు గత కొంత కాలంగా రేణును ట్రోల్ చేస్తున్నారు. రేణు కూడా వారికి ధీటుగానే స‌మాధానాలిస్తున్నారు. మ‌రికొద్ది రోజుల్లో ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు.
 
 సోష‌ల్ మీడియాలో రేణుపై ట్రోలింగ్ మ‌రింత ఎక్కువైంది. దీంతో రేణు ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. దానిని ట్విట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. `ట్విట‌ర్ నిండా విప‌రీత‌మైన ప్ర‌తికూల భావ‌న‌లు నిండి ఉన్నాయ‌ని నాకు అనిపిస్తోంది. ఇక్క‌డ ఉండే వాళ్లు అధికంగా అజ్ఞాత‌వ్య‌క్తులు, వ్య‌క్తిగ‌తంగా మ‌రియు వృత్తిగ‌తంగా చిరాకుతో ఉండే వాళ్లు. సినిమా వాళ్ల గురించి కానీ, రాజ‌కీయ నాయ‌కుల గురించి కాని త‌ప్పుగా రాయడానికే ఇష్ట‌ప‌డ‌తారు. నేను ఓ నూత‌న జీవితంలోకి ప్ర‌వేశిస్తున్న ఈ స‌మ‌యంలో ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాను. ట్విట‌ర్ నుంచి వైదొలిగి ఆ నెగిటివిటీకి దూరంగా ఉండ‌ద‌ల‌చుకున్నాను. అదే స‌మ‌యంలో న‌న్ను అర్థం చేసుకుని, నా మంచి కోరుతూ ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో నాకు తోడుగా నా వెంట ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు` అని రేణు ఓ లేఖ‌ను పోస్ట్ చేశారు.

loader