చివరి వారానికి చేరుకున్న బిగ్ బాస్ షో డ్యాన్స్ రియాల్టీ షో ప్లాన్ చేసిన స్టార్ మా న్యాయనిర్ణేతగా రేణు దేశాయ్
ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బుల్లితెర తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఆదివారంతో బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. విజేతగా ఎవరు నిలుస్తారన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు బిగ్ బాస్ షోతో ఎంజాయ్ చేశాం..మరి తర్వాత ఏమిటి అనే ప్రశ్న జనాల్లో మొదలైంది.
బిగ్ బాస్ తెలుగునాట చాలా పాపులారిటీ సంపాదించుకుంది. మళ్లీ ఇంత పాపులారిటీ రావాలంటే.. మరింత ఆసక్తికర మైన ప్రొగ్రామ్ ని తీసుకురావాలని భావించిన స్టార్ మా యాజమాన్యం ఓ డ్యాన్స్ ఫ్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేయబోతోంది. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ ముగియగానే.. ఈ డ్యాన్స్ షో ప్రారంభం అవుతుంది. ‘ నీతోనే డ్యాన్స్.’ పేరుతో వస్తున్న ఈ ప్రోగ్రామ్ కి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ జడ్జిగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది.
పవన్ భార్యగానే కాకుండా.. మహిళా సాధికారతకు పతినిధిలా ఎఫ్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తారు రేణు దేశాయ్.ఇప్పుడు ఆమె జడ్జిగా వ్యవహరిస్తారని తెలియగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమెతోపాటు జానీ మాష్టార్, హీరోయిన్ అదాశర్మలు ఈ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యహరిస్తున్నారు. ప్రముఖ యాంకర్.. ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
అయితే.. ఈ షో లో రేణు దేశాయ్ కి.. పవన్ కారణంగానే అవకాశం వచ్చిందనే వార్తలు వినపడుతున్నాయి. జానీ మాష్టర్.. పవన్ కి పెద్ద ఫ్యాన్. ఆయన రికమండేషన్ తోనే రేణు దేశాయ్ ని కూడా జడ్జిగా తీసుకున్నారని పలువురు భావిస్తున్నారు. మరి ఈ షో కూడా బిగ్ బాస్ లా పెద్ద హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి.
