రేణు దేశాయ్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తరచుగా ఆమె అకిరా, ఆద్య కి సంబంధించిన విశేషాలని పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల అకిరా బర్త్ డే సందర్భంగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది.

రేణు దేశాయ్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తరచుగా ఆమె అకిరా, ఆద్య కి సంబంధించిన విశేషాలని పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల అకిరా బర్త్ డే సందర్భంగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఆమె చేసిన మరో పోస్ట్ తో పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రేణు దేశాయ్ తన చేతికి వేయించుకున్న టాటూ చూపిస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన చేతిపై 'మౌనం పరం శీలం' అనే కొటేషన్ ని టాటూగా వేయించుకుంది. అలాగే కమలం పువ్వుని కూడా టాటూగా వేయించుకుంది. ఈ పోస్ట్ కి రేణు దేశాయ్.. కొన్నిసార్లు మాటలకంటే ఇలాంటి ఫొటోలే గట్టిగా వినిపిస్తాయి అని పేర్కొంది. 

ఇక్కడ రేణు దేశాయ్ చేసిన పోస్ట్ గురించి సాధారణంగా అయితే పాలిటిక్స్ తో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆమె చివర్లో ఎలక్షన్ 2024 అనే హ్యాష్ టాగ్ జోడించింది. దీనితో రేణు దేశాయ్ పరోక్షంగా ఈ ఎన్నికల్లో బిజెపికి మద్దతు తెలుపుతున్నట్లు చెబుతోందని నెటిజన్లు అంటున్నారు. 

View post on Instagram

ఇక పవన్ ఫ్యాన్స్ అయితే ఆమె మద్దతు జనసేనాని కూడా ఉన్నట్లే అని అంటున్నారు. ఎందుకంటే.. ఏపీలో జనసేన, బిజెపి మధ్య పొత్తు ఉంది అనే లాజిక్ బయటకి తీస్తున్నారు. ఇక రేణు దేశాయ్ గతంలో పవన్ గురించి మాట్లాడుతూ.. నాతో జరిగింది మాత్రం తప్పే. కానీ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అంటూ అభివర్ణించింది.