సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా నటిస్తూనే నిర్మాణ రంగంలోనూ తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నాడు. ఇన్నాళ్లు తాను హీరోగా నటించే సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న మహేష్, ఇప్పుడు ఇతర హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్‌ యంగ్ హీరో అడివి శేష్‌ హీరోగా మేజర్ సినిమాను ప్రకటించాడు. విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ కథతో  సినిమాను తెరకెక్కిస్తున్నారు.

గూఢచారి సినిమాను తెరకెక్కించిన యువ దర్శకుడు శశికిరణ్‌ తిక్క ఈ చిత్రాన్ని దర్శకుడు. ఈ సినిమాను సోని పిక్చర్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు మహేష్ బాబు. ఈ మూవీ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. తాజాగా షూటింగ్‌లకు అనుమతులు రావటంతో త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ మీడియా సర్కిల్స్‌లో వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ఒకప్పటి హీరోయిన్‌ రేణూ దేశాయ్‌ నటించనుందట. పవన్‌ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు దూరమైన రేణూ.. వారిద్దరూ వివడిపోయి తరువాత తిరిగి సినిమాల్లో వివిధ శాఖల్లో పనిచేస్తోంది. సొంతంగా ఓ చిత్రానికి దర్శకత్వం కూడా వహించింది. తాజాగా నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట రేణూ. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ నుంచి గానీ, రేణూ దేశాయ్‌ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.