మీ అబ్బాయిని త్వరగా హీరో చేయండి.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ కి రేణు దేశాయ్ క్రేజీ రియాక్షన్
మాస్ మహారాజ్ రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు.

మాస్ మహారాజ్ రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ 20న గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఆదివారం రోజు టైగర్ నాగేశ్వర రావు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రచయిత విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు.
విజయేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రేణు దేశాయ్ గురించి చేసిన కామెంట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. 'రేణు దేశాయ్ గారు మీరు సినిమాకి దూరంగా ఉండొచ్చు.. కానీ మీరు మాకు చాలా దగ్గర. త్వరలోనే మీరు మీ అబ్బాయిని హీరోగా చేయాలి. ఆ చిత్రంలో మీరే తల్లిగా నటించాలి అని విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో రేణు దేశాయ్ సంతోషం ఆపుకోలేకపోయింది.
ఆడిటోరియం మొత్తం హోరెత్తిపోతోంది. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ కి సంతోషంతో రేణు దేశాయ్ ఇచ్చిన క్రేజీ రియాక్షన్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే పవన్ అభిమానులంతా అకిరాని జూనియర్ పవర్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే విజయేంద్ర ప్రసాద్ రవితేజ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రవితేజ చేసిన విక్రమార్కుడు చిత్రం హిందీతో సహా అన్ని భాషల్లో రీమేక్ అయింది. కానీ ఎవ్వరూ రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయలేకపోయారు. రవితేజకి నానా రిక్వస్ట్ ఏంటంటే.. మీ ప్రతి చిత్రంతో పాన్ ఇండియాకి వెళ్ళండి. మీ ప్రతిభ అందరికి తెలియాలి అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.