పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లు తమ వివాహ బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. 
అయితే పవన్ కళ్యాణ్ సరసన రెండోసారి హీరోయిన్ గా 'జానీ' సినిమాలో నటించింది రేణు దేశాయ్.

ఈ సినిమాకి పవన్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు  నిర్వహించారు. 2003లో వచ్చిన ఈ సినిమా సంగతులను రేణు తాజాగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ''జానీ సినిమాకి మొదట నేను ప్రొడక్షన్ డిజైనర్ గా పని మొదలుపెట్టాను.

షూటింగ్ మొదలు కావడానికి మరో రెండు వారాలు ఉందనగా.. నన్ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆ సినిమాలో నటించడానికి నేను మొదట్లో ఇష్టపడలేదు. ఎందుకంటే 21 ఏళ్ల వయసులో ప్రొడక్షన్ డిజైనర్ గా, హీరోయిన్ గా రెండు పనులు పూర్తి చేయలేమోనని అనుకున్నా.. కానీ పవన్ కళ్యాణ్ నన్ను కన్విన్స్ చేశారు.

దాంతో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నాను. ఆ సినిమా కోసం దాదాపు ఏడు నెలల పాటు రోజుకి పదహారు, పదిహేడు గంటలు పనిచేసేదాన్ని. ప్రొడక్షన్ డిజైనర్ గా సెట్ కి వచ్చి అన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని చూసుకొని ఆ తరువాత మేకప్ రూమ్ కి వెళ్లి మేకప్ వేసుకునేదాన్ని'' అంటూ చెప్పుకొచ్చింది.