సినిమావాళ్లు రకరకాల నమ్మకాలతో కలిసిరానప్పుడు,కష్టాల్లో ఉన్నప్పుడు పేర్లుకు కొన్ని అక్షరాలు కలపటం, తీసేయటం వంటివి చేస్తూంటారు. అవి చిత్రంగా కలిసి వస్తూంటాయి కూడా. అయితే ఆ మార్చుకున్న పేరుని ఆ తర్వాత వాళ్లు అదే పేరుతో తమని పిలవమని అడుగుతూంటారు. మీడియాకు చెప్తూంటారు. తాజాగా రేణు దేశాయ్ సైతం తన పేరుని మార్చుకుంది. అయితే ఏదో కలిసి వస్తుందనే నమ్మకంతో కాదట. కేవలం క్రియేటివ్ గా కొత్తగా ఉంటుందనే భావనతో మార్చుకున్నాను అంటోంది. 

నటిగా, దర్శకురాలిగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూదేశాయ్ ఇప్పుడు కవితా రచయితగా కూడా మారిపోయింది.ఆమె కున్న మల్టీ టాలెంట్స్ లో కవితలు రాయడం బాగా పేరు తెచ్చిపెడుతోంది. అప్పుడప్పుడు ఆమె రాసిన కవితలు సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తూ ఉండేది రేణూ దేశాయ్. ఇప్పుడు ఆ కవితలన్నింటిని కలిపి ఓ పుస్తకరూపంలో మలింది.

ఈ పుస్తకంలో తాను రాసిన 31 కవితలు ఉన్నాయని.. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఈ కవితలు ఉన్నాయని, ఇందులో 15 కవితలను తెలుగులోకి అనంత శ్రీరామ్ ట్రాన్స్ లేట్ చేశారని ఇటీవల రేణూ దేశాయ్ చెప్పింది. అయితే ఇప్పుడు ఈపుస్తకం విడుదలైంది. ద లవ్ అన్ కండీషనల్ పేరుతో తెలుగు వర్షన్ రిలీజైంది. 

అయితే ఈ పుస్తకంలో గమనిస్తే రేణు తన పేరు ను మార్చింది. రే ను(Ray Nu) అని పెన్ నేమ్ గా తన పేరును మార్చుకుంది. ఇదిలా ఉండగా రేణూ రాసిన పుస్తకానికి తన ఫాలోవర్స్ నుండి మంచి రెప్సాన్స్ వస్తోంది. 

తన పేరు మార్చటానికి కారణం చెప్తూ “ఎందుకనో నాకు నా పేరు అంటే ఇష్టం ఉండదు, మా అమ్మమ్మ మా వాళ్లందరికీ పేర్లు పెట్టింది. అందరికి కాస్తంత క్రియేటివ్ పేర్లే పెట్టింది. అయితే నాకు పెట్టిన పేరుతో నేను డిజప్పాయింట్ అయ్యాను. కాబట్టి నేను కొత్త పేరును ట్రై చేస్తున్నాను, కొద్దిగా కవితాత్మకంగా ఉంటుందీ పేరు అని భావిస్తున్నా,” అని చెప్పుకొచ్చింది.