అవును అకీరా అప్ సెట్ అయ్యాడు : రేణు దేశాయ్

First Published 26, Jun 2018, 1:34 PM IST
Renu about akeera upset
Highlights

అవును అకీరా అప్ సెట్ అయ్యాడు : రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ఇటీవలే నిశ్చితార్థం అయింది. అతికొద్ది మంది అతిథుల మధ్య ఓ ప్రైవేట్ వేడుకలా ఈ కార్యక్రమం జరిగింది. కారణాలేమైనా రేణు తన కాబోయే భర్తకు సంబంధించిన విషయాలేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన విశేషాలను రేణు ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.
 
ఈ సందర్భంగా ఈ పెళ్లి ఆమె కుమారుడు అకీరా నందన్‌కి ఇష్టం లేదని.. దీంతో అతను అప్‌సెట్ అయ్యాడంటూ వస్తున్న వార్తలపై సరదాగా స్పందించింది. ‘‘చాలా మంది నా రెండో పెళ్లి కారణంగా అకీరా అప్‌సెట్ అయ్యాడని ఆరోపిస్తున్నారు. అకీరా అప్‌సెట్ అయిన మాట వాస్తవమే కానీ నిజానికి అతను అప్‌సెట్ అయింది పెళ్లి గురించి కాదు.. మెనూలో పనీర్ బటర్ మసాలా లేదని’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

loader