మెంటల్ మదిలో అంటూ తెలుగు ఆడియెన్స్ కి తన టాలెంట్ చూపించిన పేతురేజ్ పై ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. బ్రోచేవారెవరురా - చిత్రలహరి సినిమాల్లో అమ్మడు చేసిన సపోర్టింగ్ రోల్స్ కి మంచి గుర్తింపు దక్కింది. దీంతో క్రేజ్ వచ్చినప్పుడే రెమ్యునరేషన్ పెంచేసి నిర్మాతలను భయపెడుతోందట. 

విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక స్పెషల్ రోల్ లో నటించే అవకాశం వచ్చినప్పటికీ 20రోజుల కాల్షీట్స్ కి 70 లక్షలకు పైగా డిమాండ్ చేస్తుండడంతో నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారట. అలాంటి అనుభవాలు ఎదురవుతున్నప్పటికీ బేబీ తన రేటును ఏ మాత్రం తగ్గించడం లేదని తెలుస్తోంది. 

రవితేజ డిస్కోరాజా సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఇదే తరహాలో పారితోషికం చెప్పి అవకాశాన్ని వదులుకుంది. దీంతో నిర్మాతలు నాభా నటేష్ ని తీసుకున్నారట.  బేబీ అంచనాలకు మించి అత్యధిక రెమ్యునరేషన్ అడిగి ఇప్పటికే నాలుగు మంచి అవకాశాలను మిస్ చేసుకుందట. మరి ఇలానే కొనసాగితే నివేత స్టార్ హీరోయిన్ గా ఎదగడం కష్టమే..?