Asianet News TeluguAsianet News Telugu

#Avatar 3: 'అవతార్‌ -3’రిలీజ్ డేట్ ప్రకటన

అవతార్ 3 చిత్రం రిలీజ్ డేట్ సైతం ఈ చిత్రం విడుదల సమయంలో కేమెరాన్ చెప్పేసారు. 

Release Date Of James Cameron Avatar 3
Author
First Published Dec 14, 2022, 12:00 PM IST


'అవతార్‌’... ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేని ఓ అద్భుతమైన అనుభవం గా అలా గుర్తుండిపోయింది. జేమ్స్‌ కేమెరాన్‌ తన ఊహాశక్తిని తెరపై ఆవిష్కరించిన అరుదైన దృశ్యకావ్యం ఇన్నేళ్లు అయినా జనం మర్చిపోలేదు. ఏళ్ల తరబడి శ్రమించి, సృష్టించిన ఒక అందమైన లోకంలోకి ఆయన ప్రేక్షకుల్ని తీసుకెళ్లి వదిలేశారు. అక్కడి అందాలు, భావోద్వేగాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.  ప్రపంచవ్యాప్తంగా ‘అవతార్‌’ ఓ క్లాసిక్‌గా ఆబాలగోపాలాన్ని అలరించింది . 

దాదాపు  పుష్కర కాలం తర్వాత మరోసారి సQరికొత్త ‘అవతార్‌’ (Avatar)తో మ్యాజిక్‌ చేయడానికి ప్రేక్షకుల ముందుకు స్తున్నారాయన. ఈసారి ‘పండోరా’ దీవి నుంచి ‘ది వే ఆఫ్‌ వాటర్‌’ అంటూ నీటిలోకి మనల్ని తీసుకెళ్లేందుకు ‘అవతార్‌ 2’ (Avatar 2)తో సిద్ధమయ్యారు. ఇంతకీ ఈ సరికొత్త లోకం ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అందరిలో ఉంది. 

ఈ సినిమా అధిక భాగం నీళ్లలోనే చిత్రీకరించడం విశేషం. అండర్‌వాటర్‌ పిక్చరైజేషన్‌ కావడం వల్ల చిత్రీకరణకు ఎక్కువ సమయం తీసుకున్నారు. అంతేకాదు, షూటింగ్‌కోసం 9లక్షల గ్యాలన్ల నీళ్లను నిల్వ చేయగల వాటర్‌ ట్యాంకుల్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. దాంతో బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ‘అవతార్‌2’ నిర్మాణ విలువ రూ.3000 కోట్లపైనే. ఆ తరవాత తీయబోయే ‘అవతార్‌’ (Avatar) సీక్వెల్స్‌కూ కేటాయించిన బడ్జెట్‌ను కూడా కలుపుకుంటే మొత్తంగా  దాదాపు రూ.11,300 కోట్లు ఖర్చు చేస్తున్నాడు కామెరూన్‌. అందుకే ప్రపంచ సినిమా చరిత్రలో ఇంత ఖరీదైన మూవీ సిరీస్‌ మరేదీ లేదు. మనదేశంలో ఇంగ్లిష్‌, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ తదితర భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా టికెట్ల విషయంలోనూ రికార్డు సృష్టిస్తోంది. బెంగళూరు, కోల్‌కతా, ముంబయి వంటి చోట్ల దాదాపు 1500 రూపాయలు పలుకుతున్నాయి టికెట్‌ ధరలు.

ఇదిలా ఉంటే అవతార్ 3 చిత్రం రిలీజ్ డేట్ సైతం ఈ చిత్రం విడుదల సమయంలో కేమెరాన్ చెప్పేసారు. రీసెంట్ గా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో కేమెరాన్ మాట్లాడుతూ....డిసెంబర్ 20, 2024న అవతార్ 3 రిలీజ్ అవుతుందని చెప్పారు. మిగతా ఇనిస్టాల్మెంట్స్ 2028 లో రిలీజ్ అవుతాయని అన్నారు. అవాతార్ పార్ట్ 2, 3 హిట్ అయితేనే మిగతా సీక్వెల్స్ ఉంటాయని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios