కాస్టింగ్ కౌచ్ గురించి విపరీతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొంతమంది తారలు తమకు కాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో తెలియదని అమాయకంగా చెపుతున్నారు. మరికొందరు మాత్రం తమను ఛాన్సుల పేరుతో లైంగికంగా వేధించారని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక మాధవీలత కూడా కాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్నదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి జాబితాలో చేరిపోయింది హీరోయిన్ 

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… టాలీవుడ్ ఇండస్ట్రీలో త‌న‌పై కూడా లైంగిక వేధింపుల‌ు జరిగాయని తెలిపింది. తమ లైంగిక వాంఛ తీర్చాల‌ని కోరారనీ, తను మాత్రం ఎవ్వరికీ లొంగలేదని వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్ అనేది సినీ రంగంలో కామన్ అని తేల్చి చెప్పింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయిలు అలాంటివారి నుంచి తప్పించుకునేందుకు చాలా తెలివిగా వుండాలని చెపుతోంది.