Asianet News TeluguAsianet News Telugu

ఇటు రామ్ గోపాల్ వర్మ, అటు రామ్ కే ఆ రికార్డ్

7 నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. సగం సీట్లతో అనుమతినిస్తూ బుధవారం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం..అక్టోబర్ 15 నుంచి సినిమా థియోటర్లకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. 

Red to be the first major film to release in theatres!
Author
Hyderabad, First Published Oct 1, 2020, 11:57 AM IST

భారత ప్రభుత్వం..సినిమా థియోటర్స్ ని అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చని ఫర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ తన కరోనా వైరస్ సినిమాని రిలీజ్ చేస్తానని, అదే ఫస్ట్ సినిమా లాక్ డౌన్ తర్వాత థియోటర్స్ లో విడుదల అయ్యేదని అని ట్విట్టర్లో ప్రకటించారు. అలాంటి చిన్న సినిమాలను ప్రక్కన పెడితే పెద్ద సినిమాలలో ...మొదటగా థియోటర్స్ రీలాంచ్ లో విడుదల అయ్యేది...రెడ్ అని తెలుస్తోంది. ఏప్రియల్ 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కానీ దీపావళికి ఈ సినిమా కాబోతోందని సమాచారం. 

గత ఏడాది పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షులను ఆకట్టుకున్నాడు హీరో రామ్.. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేసాడు. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు.

 ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. తమిళ మూవీ 'తదమ్' స్టోరీ లైన్ ఆధారంగా తెరకెక్కుతున్నప్పటికి సినిమా కథ, కథనం మాత్రం చాలా కొత్తగా ఉంటాయని మేకర్స్ అంటున్నారు.. ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ హిట్ తర్వాత రామ్ మూవీ కావడం, మళ్ళీ ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ నేపధ్యంలో రామ్ కొత్త చిత్రం ‘రెడ్’ డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ మొదట అనుకుంటుండ‌గా..  ఎట్టి ప‌రిస్థితుల్లో త‌న సినిమాను థియేట‌ర్స్‌లోనే రిలీజ్ చేయాల‌ని రామ్ పట్టుబట్టి ఆపాడట‌.  


ఇక క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్లన్నీ మూత ప‌డ్డాయి. దీంతో చాలా సినిమాలు విడుద‌ల ఆగిపోయాయి. మ‌రోవైపు మ‌ధ్యలోనే మ‌రికొన్ని చిత్రాల షూటింగులు నిలిచిపోయాయి. ఇక చాలా సినిమాల‌ని ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు ద‌ర్మక నిర్మాత‌లు. పైగా ఓటీటీ ప్లేయ‌ర్స్ మంచి రేటును కూడా ఆఫ‌ర్ చేస్తున్నాయి. రీసెంట్ గా నాని సినిమా ‘వి’ కూడా సెప్టెంబ‌ర్ 5న‌ ఓటీటీలోనే రిలీజ్  అయ్యింది. ఈ రోజు రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న ఒరేయ్ బుజ్జిగా, అనుష్క చిత్రం నిశ్సబ్దం రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios