Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ సినిమా కోసం భారీ సెట్, ఎన్నికోట్లు పెడుతున్నారంటే..?

ప్రస్తుతం యూరప్ లో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అక్కడ కాలుకి సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. నవంబర్ ఫస్ట్ వీక్ లో ఆయన ఇండియా రాబోతున్నాడు. ఇక వచ్చినప్పటి నుంచి రెస్ట్ లెస్ గా తన షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉంటాడట. ముందుగా సలర్ ప్రమోషన్స్ కు కొబ్బరికాయ కొట్టబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఆతరువాత మారుతీ డైరెక్టర్ చేస్తున్న సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడట ప్రభాస్. 
 
Rebel Star Prabhas Maruthi Movie Special Set JMS
Author
First Published Oct 31, 2023, 1:11 PM IST | Last Updated Oct 31, 2023, 1:11 PM IST

ప్రస్తుతం యూరప్ లో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అక్కడ కాలుకి సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. నవంబర్ ఫస్ట్ వీక్ లో ఆయన ఇండియా రాబోతున్నాడు. ఇక వచ్చినప్పటి నుంచి రెస్ట్ లెస్ గా తన షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉంటాడట. ముందుగా సలర్ ప్రమోషన్స్ కు కొబ్బరికాయ కొట్టబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఆతరువాత మారుతీ డైరెక్టర్ చేస్తున్న సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడట ప్రభాస్. 

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్‌ తో ఓ భారీ  సినిమా ప్లాన్ చేశాడు.   ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం భారీ సెట్ ను ప్లాన్ చేస్తున్నారట టీమ్. అది కూడా  ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం గట్టిగా ఆలోచిస్తున్నాడట మారుతి.  ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారని సమాచారం. ఈసెట్ ను దాదాపు 4 కోట్లతో ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.  ఈ యాక్షన్ సీక్వెన్స్  సినిమాకే హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. 

ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ విజువల్స్ వండర్ అవుతాయని.. ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం.  మరీ ముఖ్యంగా ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.ఈ సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మారుతి ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు.. కామన్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈసినిమాలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ మసాలా గట్టిగానే కలపబోతున్నాడట. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుందట. అయితే ప్రభాస్ తో మారుతి సినిమా హిట్ అయితే.. ఈ టాలీవుడ్ డైరెక్టర్ ను పట్టుకోవడం కష్టమనే చెప్పాలి. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios