మొన్నటి దాకా మాస్ సినిమాలతో మెప్పించిన విశ్వక్ ఇప్పుడు క్లాస్ సినిమాలతో కూడా జనాల్ని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతోంది. అయితే బజ్ అంతలా కనపడటం లేదు. అందుకు కారణం ఏమిటనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్‌లో మాస్ కా దాస్ అనే పేరును తెచ్చుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘ఓరి దేవుడా..’ తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఓ మై కాదవులే’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రేపు రిలీజ్ అవుతోంది. అయితే బజ్ అంతలా కనపడటం లేదు. అందుకు కారణం ఏమిటనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
వెరైటీ కథలను సెలెక్ట్ చేసుకుంటూ విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విశ్వక్‌సేన్ (Vishwak Sen). అయితే అదే సమయంలో ప్రతీ సినిమా రిలీజ్ కు ముందు ఏదో ఒక వివాదంతో జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఫలక్ నామాదాస్ సమయంలోనూ, పాగల్ టైమ్ లోనూ చేసిన వివాదాలు బాగానే వర్కవుట్ అయ్యాయి.
అలాగే అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా రిలీజ్ సమయంలోనూ ఒక యువకుడితో కలిసి విశ్వక్‌సేన్ రోడ్డుపై ప్రాంక్ వీడియో చేశాడు. అది కాస్తా రచ్చ రచ్చ అయ్యింది. తన ప్రాంక్ వీడియో కోసం ఓ యువకుడ్ని తీసుకొచ్చాడు విశ్వక్. కొత్త సినిమా రిలీజ్ అయ్యే సమయంలో ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద రివ్యూలు చేసే యువకుడితో ఈ ప్రాంక్ వీడియో చేశాడు. ‘విశ్వక్‌సేన్ తన కారులో ఫిలింనగర్ రోడ్డులో వెళుతుంటాడు, సరిగ్గా అదే సమయంలో ఆ యువకుడు రోడ్డుపై కారుకు అడ్డంగా పడుకుని హల్‌చల్ చేశాడు. విశ్వక్‌సేన్ కారులోంచి దిగి అసలేం జరిగిందని యువకుడిని అడుగుతాడు.
అప్పుడు ఆ యువకుడు అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాలో హీరో విశ్వక్‌సేన్ పేరు)కు33 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాలేదు సార్. అది నేను తట్టుకోలేకపోతున్నాను. పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకుంటానంటూ హడావుడి చేశాడు. ఇదంతా నిజంగానే జరుగుతోందా అన్నట్టు విశ్వక్ కూడా బిహేవ్ చేశాడు. రోడ్డుపై ప్రాంక్ వీడియో చేయడంపై పలువురు విశ్వక్‌పై మండిపడ్డారు. కొందరైతే.. ప్రమోషన్స్ కోసం ఇంతకు దిగజారుతారా అని విమర్శలు కూడా చేసారు. టీవి 9 నాగవల్లితో చేసిన వివాదం కూడా బాగానే జనాల్లోకి వెళ్లింది. ఇప్పుడు తన తాజా చిత్రానికి మాత్రం ఏ వివాదం తోడు కాలేదు.
విష్వక్సేన్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో 'ఓరి దేవుడా' సినిమా రూపొందింది. పీవీపీ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. విష్వక్సేన్ సరసన నాయికలుగా మిథిల పాల్కర్ .. ఆశా భట్ కనిపించనున్నారు. కథలో కీలకంగా కనిపించే ప్రత్యేకమైన పాత్రను వెంకటేశ్ పోషించారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
తన తప్పులు తాను తెలుసుకుని తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి దేవుడి నుంచి మరో ఛాన్సును పొందిన ఒక యువకుడి కథ ఇది. మోడ్రన్ లుక్ తోనే ఈ సినిమాలో దేవుడిగా వెంకటేశ్ కనిపించనున్నాడు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమా. అలాగే తనకి గల ఇమేజ్ నుంచి బయటికి వచ్చి విష్వక్ సేన్ చేసిన సినిమా. రొమాంటిక్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో విష్వక్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.
