అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతిని ఎంపిక చేసారు. షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. అయితే ఈ సినిమాని మొదట తెలుగు,మళయాళంలో మాత్రమే రిలీజ్ ప్లాన్ చేసారు. అప్పటిదాకా ఎవరికీ సమస్య రాలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా సుకుమార్ మార్చారు. ఈ నేఫధ్యంలో కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక్కడే విజయ్ సేతుపతికు సమస్య వచ్చినట్లు సమాచారం. 

విజయ్ సేతుపతికు తమళంలో ఇంకా హీరోగా మార్కెట్ ఉంది. దాంతో ఆయన అక్కడ విలన్ గా కనపడటానికి ఇష్టపడటం లేదు. ఈ విషయాన్నే సుకుమార్ కు చెప్పి, తమిళ వెర్షన్ దాకా వేరే వారితో షూట్ చేసుకోమని చెప్పారట. అయితే సుకుమార్ అలా చేయటం కష్టమని తేల్చి చెప్పారట. ఎందుకంటే పని రెట్టింపు అయ్యిపోతుందని, విలన్ ..హీరో కాంబినేషన్ సీన్స్ మొత్తం రీ షూట్ చేయాల్సి వస్తుందని బడ్జెట్,టైమ్ పరంగా అది వర్కవుట్ కాదని చెప్పారట. 

అంతేకాక ఆ పాత్ర తమిళంలోనూ బాగా వర్కవుట్ అవుతుందని, నెగిటివ్ గా కనపడ్డా మంచి రెస్పాన్స్ వస్తుందని ఒప్పించే ప్రయత్నం చేసారట. అయితే విజయ్ సేతుపతి మాత్రం అందుకు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. ఆ పాయింట్ దగ్గరే విజయ్ సేతుపతి ఆ ప్రాజెక్ట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని, తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.  

ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర టీమ్.. ఫస్ట్ లుక్ కమ్ టైటిల్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించటంతో మంచి ఆనందంగా ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పక్ నారాయణగా నటిస్తున్నట్లు సమాచారం.. గంధపు చెక్కల స్మగ్లింగ్ ఈ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని చెప్తున్నారు.. సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.   ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ లోగా విజయ్ సేతుపతి స్థానంలో బాలీవుడ్ నటుడుని  తీసుకోవాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా దీనిపై క్లారిటీ రావాలంటే మళ్లీ షూటింగ్ మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

జగపతిబాబు, ప్రకాష్ రాజ్‌, హరీష్‌ ఉత్తమన్‌, వెన్నెల కిశోర్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఐదు భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బన్నీ, సుకుమార్ కాంబోలో మూడో చిత్రంగా తెరకెక్కబోతోన్న పుష్పపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.