కింగ్ నాగార్జునకు టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ ని ప్రోత్సాహిస్తాడనే పేరుంది. ప్రస్తుతం నాగార్జున రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 చిత్రంలో నటించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. మన్మథుడు పేరు చెప్పగానే త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ గుర్తొస్తాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో పనిచేసిన తొలి స్టార్ హీరో సినిమా నాగార్జున నటించిన నిన్నే ప్రేమిస్తా. 

ఆ తర్వాత త్రివిక్రమ్ నువ్వునాకు నచ్చావ్ చిత్రంతో మాటల రచయితగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. నాగార్జున మన్మథుడు చిత్రం త్రివిక్రమ్ లోని మాటల మాంత్రికుడిని మరోమారు బయటపెట్టింది. ఆ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు కాకున్నా ఆయన పంచ్ డైలాగ్స్ కు అంతా ఫిదా అయ్యారు. 

అలా త్రివిక్రమ్ కెరీర్ ఆరంభంలో నాగార్జున చిత్రాలకు పనిచేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. ప్రతి హీరో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని భావిస్తారు. అఖిల్ ని డైరెక్ట్ చేయాలని నాగార్జున చాలా రోజులుగా త్రివిక్రమ్ ని రిక్వస్ట్ చేస్తున్నాడట. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశపరచడంతో నాగార్జున ఆలోచనలో పడ్డాడు. 

కానీ త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు కొనసాగిస్తున్నాడు. ఇదే నాగార్జున కోపానికి కారణం అయిందని ఇండస్ట్రీలో టాక్. మన్మథుడు 2 ప్రీరిలీజ్ ఈవెంట్ తో పాటు ఓ ఇంటర్వ్యూలో కూడా నాగార్జున త్రివిక్రమ్ గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు.