సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు కామనే.. అభిప్రాయబేధాలు కుదరక, ఈగో సమస్యల కారణంగా ప్రేమికులు ఒకరికొకరు దూరమవుతుంటారు. కానీ నటి ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోవడానికి మాత్రం కారణం డబ్బని చెబుతున్నారు.

అసలు విషయమేమిటంటే.. ఇలియానా సినిమాలు మానేసి ఆండ్రూని పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉండాలని అనుకుందట. ఆ విషయాన్ని ఆండ్రూకి ముందుగానే చెప్పిందట. అప్పుడు ఎలాంటి సమస్య లేదని చెప్పిన ఆండ్రూ ఆ తరువాత మాత్రం ఇలియానాని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడట.

ఇంత కాలం ఇలియానా డబ్బులతో ఎంజాయ్ చేసిన ఆండ్రూ డబ్బులు రావడం ఆగిపోయేసరికి సినిమాలు చేయాలని ఇలియానా మీద ఒత్తిడి తెచ్చాడట. అతడు పెడుతోన్న ప్రెషర్ ని, అతడి ప్రవర్తనని భరించలేక ఇలియానా అతడికి దూరమైందట.ఈ మేరకు బాలీవుడ్ లో వరుస కథనాలను ప్రచురిస్తున్నారు.

దీనిలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఇలియానా స్పందించాల్సిందే. బ్రేకప్ అనంతరం ఇలియానా తన దృష్టి మొత్తం సినిమాల మీద పెట్టింది. ప్రస్తుతం తన బరువు తగ్గించుకునే పనిలో పడింది. మునుపటిలా సన్నగా, నాజూకుగా తయారవ్వడానికి ప్రయత్నిస్తోంది. చిరంజీవి తదుపరి సినిమాలో హీరోయిన్ గా ఇలియానాని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.