సోమవారం రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్ర సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మొదట స్థానికులు మంటలు చెలరేగడం గమనించారు.

సోమవారం రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్ర సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మొదట స్థానికులు మంటలు చెలరేగడం గమనించారు. దీనితో వట్టినాగులపల్లి ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. దీనితో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పుతున్నారు. భారీగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

అసలు సెట్ లో మంటలు ఎలా వ్యాపించాయనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సెట్ వద్ద కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెయిన్ ఎంట్రన్స్ వద్ద కొందరు వ్యక్తులు కూర్చుని సిగరెట్ కాల్చారని ఓ వ్యక్తి చెబుతున్నాడు. వాళ్ళు వెళ్లిన కొద్ది సేపటికే మంటలు మొదలయ్యాయని అంటున్నారు. 

దగ్గర్లో నీళ్లు కూడా లేకపోవడంతో స్థానికులు మంటలు అదుపు చేయలేకపోయారు. ఫైర్ సిబ్బంది వచ్చే వరుకు ఎదురుచూడాల్సి వచ్చింది. దీనితో సెట్ పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగినట్లు అర్థం అవుతోంది. 

కోట్లాది రూపాయలు వెచ్చించి ఆచార్య చిత్ర యూనిట్ ధర్మస్థలి సెట్ నిర్మించారు. సినిమా కథ ధర్మస్థలి చుట్టే సాగుతుంది. సినిమా పూర్తయ్యాక కొన్ని సెట్స్ ని తొలగిస్తారు. కానీ కొన్ని సెట్స్ ని వేరే చిత్రాలకు మార్చి ఉపయోగించుకునేందుకు వీలుగా అలాగే ఉంచుతారు. ఆచార్య సెట్ ని బహుశా అనేందుకు అలా వదిలేశారేమో. మొత్తం 20 ఎకరాల్లో ఈ సెట్ నిర్మించారు. చిరంజీవి కెరీర్ లోనే ఆచార్య చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల శివ దరర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలని అందుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. 

చిత్ర పరిశ్రమలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. గతంలో అక్కినేని ఫ్యామిలీ నటించిన 'మనం' చిత్ర సెట్ కూడా మంటల్లో పూర్తిగా ధ్వంసం అయింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ఇదే. దీనితో ఆ సెట్ ని తండ్రికి గుర్తుగా అలాగే ఉంచుకోవాలని నాగ్ భావించారు. దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదం జరిగి ఆ సెట్ కాలిపోయింది.