Asianet News TeluguAsianet News Telugu

‘సర్ధార్’లో అఖిల్ ...నాగ్ రిలీజ్ వెనక అసలు సీక్రెట్ ఇదే?


కార్తి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్దార్‌’. పీఎస్‌ మిత్రన్‌ దర్శకుడు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది. 
 

Reason behind Annapurna Studios acquired Karthi Sardar rights
Author
First Published Oct 18, 2022, 7:43 AM IST


తమిళ్ హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మొదటి సినిమానుంచి కార్తీ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్స్ అందుకున్నాయి. కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోన్నాడు కార్తీ. ఇటీవలే సుల్తాన్ సినిమాతో ఆకట్టుకున్న కార్తీ ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సర్దార్.

 కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది.  అయితే నాగార్జున స్వయంగా ఈ చిత్రం రైట్స్ తీసుకోవటానికి ఉత్సాహం చూపించారని తెలుస్తోంది. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కార్తికి, నాగార్జున కు ఉన్న అనుబందంతోనే ఈ  సినిమా తీసుకున్నాడనుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఊపిరి చిత్రం చేసారు. అయితే అది అసలైన కారణం కాదని, వేరే ఉందని తెలుస్తోంది. అదేమిటంటే... 

‘అభిమన్యుడు’ చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. టెక్నాలజీకల్ థ్రిల్లర్స్ అందించడంలో పేరుపొందిన ఈ  దర్శకుడు ‘సర్దార్‌’కథను మొదట నాగార్జునకు చెప్పారట. అదీ అఖిల్, నాగార్జున కలిపి చెయ్యటం కోసం. అయితే ఈ కథ విన్నాక చాలా బాగుందని మెచ్చుకున్నారట. అయితే, ఇది అఖిల్ కు చాలా పెద్దదై పోతుందని, మోయటం కష్టమని నాగ్ ఫీలయ్యానని చెప్పారట. అలాగే అఖిల్ కోసం ఓకే చేసిన ఏజెంట్ కూడా స్పై థ్రిల్లర్ అని చెప్పారట.  అందుకు అనుభవం, మాస్ ఇమేజ్ ఉన్న హీరో అయితే బెస్ట్ అని కార్తి దగ్గరకు పంపారట. నాగార్జునకు అనుకున్న పాత్ర, అఖిల్ కు అనుకున్న పాత్ర రెండూ కార్తీ చేతే చేయించి ఈ సినిమా తీసారని సమాచారం.  కార్తి  మారువేషంలో ఉన్న సర్దార్‌గా, ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో చేసారు.  దాంతో ఆ కథపై ఉన్న ఇష్టం,నమ్మకంతో నాగ్ ఈ రైట్స్ ని తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడు అఖిల్ కోసం మరో ఆసక్తికరమైన కథను రెడీ చేస్తున్నారు మిత్రన్. 
 
”అన్నపూర్ణ స్టూడియోస్ నా ఫేవరేట్ ప్రొడక్షన్ హౌస్. నాగార్జున గారి ఆతిధ్యం అద్భుతంగా వుంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సర్దార్ ని తెలుగు విడుదల చేయడం అనందంగా వుంది. అఖిల్ తో ఒక సినిమా చేసే ఆలోచన ఎప్పటి నుండో వుంది. చాలా సార్లు కథా చర్చలు జరిపాం. అఖిల్ కోసం కథ రాస్తున్నా. అఖిల్ ఏజెంట్ తో బిజీగా వున్నారు. దిని తర్వాత అఖిల్ కి కథ వినిపిస్తా” అని చెప్పుకొచ్చారు మిత్రన్.
 
ఇక కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. సర్దార్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుండగా, రజిషా విజయన్, చుంకీ పాండే కీలక పాత్రలలో కనిపించనున్నారు. సర్దార్ 2022 దీపావళికి తెలుగు, తమిళంలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుండటంతో సహజంగానే ఈ చిత్రం తెలుగులో భారీ సంఖ్యలో గ్రాండ్ గా థియేటర్ రిలీజ్ కానుంది.  రాశీఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జార్జ్‌ సి విలియయ్స్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, నిర్మాణ సంస్థలు: ప్రిన్స్‌ పిక్చర్స్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌.  

Follow Us:
Download App:
  • android
  • ios