రియల్‌ హీరో సోనూసూద్‌ ఎమోషనల్‌ అయ్యారు. తన తండ్రిని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగం చెందారు. ఆయన జ్ఞాపకంగా ఉన్న స్కూటర్‌పై కూర్చొన్న ఫోటోని పంచుకుని `ఫాదర్స్ డే` సందర్భంగా విషెస్‌ తెలిపారు.

రియల్‌ హీరో సోనూసూద్‌ ఎమోషనల్‌ అయ్యారు. తన తండ్రిని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగం చెందారు. ఆయన జ్ఞాపకంగా ఉన్న స్కూటర్‌పై కూర్చొన్న ఫోటోని పంచుకుని `ఫాదర్స్ డే` సందర్భంగా విషెస్‌ తెలిపారు. `డియర్‌ నాన్న. మీరిప్పుడు నా చుట్టూ లేరు. కానీ మీకు ఇష్టమైన స్కూటర్‌ ఎల్లప్పుడు నాకు అత్యంత విలువైన వాటి జాబితాలోఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడూ మిస్‌ అవుతుంటాను. హ్యాపీ ఫాదర్స్ డే` అని తెలిపారు. 

Scroll to load tweet…

ఈ సందర్భంగా తండ్రి శక్తి సూద్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోని పంచుకున్నారు. ఇంటి వద్ద తండ్రి స్కూటర్‌పై ఉన్న సోనూ సూద్‌ ఫోటో, తండ్రి ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక విలన్‌ పాత్రలతో పాపులర్‌ అయిన సోనూ సూద్‌ ఇప్పుడు రియల్‌ లైఫ్‌లో రియల్‌ హీరో అని నిరూపించుకుంటున్నారు. కరోనాతో పోరులో అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. తనవంతు సాయం చేస్తున్నారు. బెడ్స్, ఆక్సిజన్‌ సిలెండర్లు, అక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు నటుడిగానూ అందరి మనుసులు దోచుకుంటున్నారు.