హైదరాబాద్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ మండి ప్లేట్.. లాంచ్ చేసిన సోనూసూద్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!
రియల్ హీరో సోనూసూద్ (Sonu sood) ఈరోజు హైదరాబాద్ లో సందడి చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ మండి ప్లేట్ తో ప్రారంభించిన రెస్టారెంట్ ను ఇవ్వాళ ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
బాలీవుడ్ స్టార్, రియల్ హీరో సోనూసుద్ కు దేశ వ్యాప్తంగా ఎంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో ఆయన చాటుకున్న మంచి మనస్సుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. లక్షల మందికి సాయం చేసిన ఈ రియల్ హీరో.. ఈరోజు హైదరాబాద్ లో సందడి చేశారు. భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందిస్తున్న ‘జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్’ హైదరాబాద్ లోని కొండాపూర్ సర్కిల్ లో కొనసాగుతోంది.
తాజాగా ఈ జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ లంచ్ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్ హాజరయ్యారు. బిగ్గెస్ట్ మండి ప్లేట్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. కార్యక్రమం లో ఆయన వెంట నటి హిమజ, ఇన్స్టాగ్రామర్ పద్దు పద్మావతి, తదితరులు హాజరయ్యారు. ఈప్లేట్ లో ఒకేసారి 15 మందికి సర్వ్ చేసే అవకాశం కలదు. ఇక హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా సోనూసూద్ కు తెలుగు ఫ్యాన్స్ గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు,జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ వారు వినూత్నంగా ఆలోచించి ఈ విధంగా ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ లంచ్ ఏర్పాటు చెయడం అభినందనీయమని అన్నారు. ఇందుకు జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ ఓనర్స్ గౌతమి, ధర్మ, గౌతమ్ సోనూసూద్ కు ధన్యవాదాలు తెలిపారు. కస్టమర్ల కోరిక మేరకే ప్రారంభించామన్నారు. ఇండియాలో ఇది బిగ్గెస్ట్ మండి ప్లేట్ అని.. 8 ఫీట్ డయామీటర్ తో ఒకే సారి 15 నుండి 20 మెంబెర్స్ కూర్చొని తినవచ్చు తెలిపారు. దీంట్లో చికెన్, మటన్ ఆన్ లిమిటెడ్ ఫుడ్ అందిస్తామన్నారు.