రియల్‌ హీరో సోనూ సూద్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న ఆయన ఓ చిన్నారి మరణంతో చలించిపోయారు. ఈ మేరకు ఆయన ఓ భావోద్వేగంతో కూడిన ట్వీట్‌ పెట్టారు. `భారతి, నాగపూర్‌కి చెందిన అమ్మాయి. నిన్న రాత్రి నాగపూర్‌ నుంచి హైదరాబాద్‌కి ఎయిర్‌ అంబులెన్స్ లో తీసుకొచ్చాను. నెల రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసి శుక్రవారం కన్నుమూసింది. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. ఆమెని బతికిస్తామనుకున్నా. కానీ జీవితంలో ఏం జరుగుతుందో ఊహించలేం. నా హృదయం ముక్కలైంది` అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు సోనూ సూద్‌.  

క‌రోనా బారిన ప‌డిన భార‌తిని మెరుగైన చికిత్స కోసం ఎక్మో చికిత్స కోసం హైద‌రాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ను తీసుకొచ్చారు. కానీ ఆమె కన్నుమూయడం కలచివేస్తుంది. ఇక సోనూ సూద్‌ కరోనా బాధితులను, పేషెంట్లని ఆదుకునేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఫస్ట్ వేవ్‌లో వేలాది మంది వలస కార్మికులను ఆదుకున్న ఆయన ఇప్పుడు కరోనా ఆసుపత్రుల్లో పోరాడుతున్న రోగులకు ఆక్సిజన్‌ అందించడంలో, రెమిడిసిమిర్‌ మందులు, వెంటిలేటర్స్, బెడ్ల కోసం ఇబ్బంది పడుతున్న వారికి బెడ్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు.