సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చాలా మందికి కొత్త అనుభూతిని నేర్పుతుంది. బిజీ బిజీ లైఫ్ లో ఒకప్పుడు పని చేసిన తారలను మళ్ళీ కలవడానికి వీలు పడదు. ఒక వేళ కలిస్తే ఆ కిక్కు మాములుగా ఉండదు. స్టార్స్ కె కాకుండా ఆడియెన్స్ కి కూడా మంచి కిక్ ఇస్తుంది. ప్రస్తుతం రెడీ జోడి కూడా అందరిని అలానే ఆకట్టుకుంటోంది. 

జెనీలియా - రామ్ జంటగా 2008లో వచ్చిన రెడీ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా రిలీజైన 11 ఏళ్ల తరువాత మళ్ళీ రెడీ జోడి ఒక ఫ్రెమ్ లో దర్శనమిచ్చింది. ఇటీవల తన 32వ పుట్టినరోజు సందర్బంగా జెనీలియా రామ్ ని స్పెషల్ గా ఇన్వైట్ చేసింది. 

భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి పుట్టినరోజు జారుకుంటుండగా రామ్ కూడా పార్టీలో పాల్గొన్నాడు. సత్యం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జెనీలియా బొమ్మరిల్లు సినిమాతో హాసిని గా అందరికి అలా గుర్తుండి పోయింది. రానాతో నా ఇష్టం సినిమా తరువాత మళ్ళీ కనిపించలేదు. 2012లో రితేష్ ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.