గత ఏడాది విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ ప్రాఫిట్స్ అందించిన ఆ సినిమా హిట్టవ్వడానికి హీరోయిన్ గ్లామర్ కూడా ప్రధాన కారణం. ఆ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై హీటెక్కించిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరోసారి తన గ్లామర్ తో వెండితెరను ఎటాక్ చేయడానికి సిద్ధమైంది. 

అదే గ్లామర్ ఫార్మాట్ లో RDXలవ్ అనే సినిమాతో  సిద్ధమైంది. ఆ సినిమా మరికొన్ని వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్ పోస్టర్స్ తో ప్రమోషన్ డోస్ పెంచుతోంది.సైరా అలాగే కొన్ని మీడియం బడ్జెట్ సినిమాల రిలీజ్ అనంతరం అక్టోబర్ 11న ఆర్ డిఎక్స్ లవ్ సినిమా విడుదల కాబోతోంది.  

కొన్ని రోజుల క్రితం సినిమా టీజర్ ని విడుదల చేసి ఓ వర్గం ఆడియెన్స్ ని చిత్ర యూనిట్ ఎట్రాక్ట్ చేసింది. రొమాన్స్ డోస్ ఎక్కువైనట్లు డైలాగ్స్ తో అర్ధమవుతోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ డోస్ గట్టిగానే ఉంది. ఇక పాయల్ గ్లామర్ షో టీజర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. దీంతో టీజర్ నిమిషాల్లో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందో చూడాలి.